T20 World cup 2022: మెల్బోర్న్ వేదికగా చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ తో అక్టోబర్ 23న టీమిండియా తలపడనున్నది. ఈ క్రికెట్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఎంతగానో వినోదాన్ని పంచనున్నది. ఈ T20 వరల్డ్ కప్ కు ముందే టీమిండియా కప్ కొట్టాలని ఎన్నో వ్యూహరచనలు చేసింది. ఈ టోర్నీలో ఇండియా ఆటగాళ్లు తమవంతుగా ఆయా విభాగాల్లో కీలక పాత్రలు పోషించనున్నారు. అందులో ముఖ్యంగా కోహ్లీ కీలక పాత్ర పోషించనున్నాడు.
విరాట్ కోహ్లీ అంటే మనకు గుర్తొచ్చేది రన్ మెషిన్ అని. జట్టుకు కీలక భాగస్వామ్యాలు అందించడంలో కోహ్లీ తన వంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నాడు. జట్టు కూర్పుపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చామని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పడంతో వన్ డౌన్ లో విరాట్ కోహ్లీ టాప్ ఆర్డర్ ఆటగాళ్లతో భాగస్వామ్యాలను నెలకొల్పనున్నాడు. T20ల్లో భాగస్వామ్యాలు నెలకొల్పడంలో మంచి రికార్డు ఉన్న విరాట్ కోహ్లీ తన మేరకు రాణిస్తే టీమిండియా స్కోర్ బోర్డుపై అధిక పరుగులు చేయడానికి వీలుంటుంది.
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ లలా దూకుడుగా ఆడకుండా భాగస్వామ్యాలను నిర్మించే బాధ్యతను కోచ్ రాహుల్ ద్రావిడ్ విరాట్ కోహ్లీకి అప్పగించినట్లు సమాచారం. ఇక చివర్లలో హార్థిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్ లాంటి ప్లేయర్లు మెరుపులు మెరిపించడంలో సిద్ధంగా ఉంటారు.
T20 World cup 2022:
వికెట్ల మధ్య పరిగెత్తడంలో ధోని తర్వాత కోహ్లీయే టాప్ లో కొనసాగుతున్నాడు. కేవలం ఒకటి, రెండు భారీ భాగస్వామ్యాలు నెలకొల్పిన టీమిండియా అధిక స్కోరు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి కోచ్ రాహుల్ ద్రావిడ్ రచించిన వ్యూహాలకు అనుగుణంగా విరాట్ కోహ్లీ ఆడతాడో లేదో వేచి చూడాలి.