బిగ్ బాస్ సీజన్ 6 సెప్టెంబర్ 4 నుంచి ఆరంభం అయ్యింది. ఇక ఈ సీజన్ కి సంబంధించి ఇప్పటికే కంటిస్టెంట్ ల ఫైనల్ లిస్ట్ బయటకి వచ్చేసింది. పాల్గొనే అందరూ కూడా కాస్తా బజ్ ఉన్నవారే కావడంతో ఈ సీజన్ మీద కొంత క్యూరియాసిటీ పెరిగింది. ఇక హౌస్ లో హంగామా అంతా సోమవారం నుంచి మొదలు కాబోతుంది. పోటీలు, ఒకరిపై ఒకరి ఎత్తులు పై ఎత్తులతో ఆట రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. అయితే ఈ సారి బిగ్ బాస్ సీజన్ కి పెద్ద అడ్డంకి ఎదురుకాబోతుంది.
దీనికి కారణం టి-20 వరల్డ్ కప్ క్రికెట్ ప్రారంభం కావడమే. ఇండియాలో సినిమా కంటే ఎక్కువగా ప్రేక్షకులని అలరించేది అంటే క్రికెట్ అనే విషయం అందరికి తెలిసిందే. అలాంటి క్రికెట్ పండగ స్టార్ట్ అయ్యింది యూత్ ఇంకా ఎలాంటి షోలని పట్టించుకోరు. కేవలం క్రికెట్ కి అతుక్కుపోతారు. అలాంటి క్రికెట్ మ్యాచ్ లు కూడా లైవ్ టెలికాస్ట్ అయ్యేవి కరెక్ట్ గా బిగ్ బాస్ ఎపిసోడ్ ప్రసారం అయ్యే సమయంలోనే కావడం విశేషం. అక్టోబర్ 16మా వరల్డ్ టి-20 క్రికెట్ ప్రారంభం కాబోతుంది. ఇది నవంబర్ వరకు ఉంటుంది.
ఈ నేపధ్యంలో బిగ్ బాస్ మంచి బజ్ నడిచే సమయంలో క్రికెట్ ఫీవర్ ఎఫెక్ట్ గట్టిగా పడే అవకాశం ఉంది. ఓ విధంగా చెప్పాలంటే ఇది బిగ్ బాస్ నిర్వాహకులకి భాగా దెబ్బ అని చెప్పొచ్చు. అసలే అంతంత మాత్రం రేటింగ్స్ తో బిగ్ బాస్ నడుస్తుంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫెయిల్యూర్ అయ్యింది. దాని తర్వాత ఈ సీజన్ 6 ప్రస్తుతం ప్రారంభం అయ్యింది. మరి ఇన్ని అడ్డంకుల మధ్యలో ఈ సీజన్ ఎంత వరకు ప్రేక్షకులకి చేరువ అవుతుంది అనేది చూడాలి.