Swathimuthyam Movie Review: ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఫ్యామిలీ నుంచి మరో హీరో వచ్చేశాడు. ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు సురేశ్ రెండో తనయుడు బెల్లంకొండ గణేశ్ ” స్వాతిముత్యం ” అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనున్నాడు. దసరా కానుకగా నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. డైరెక్టర్ లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించాడు. మిడిల్ క్లాస్ మెలోడీస్ ఫేమ్ వర్ష బొల్లమ్మ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. అలానే రావు రమేష్, నరేష్, ప్రగతి, సురేఖా వాణి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు నటించారు.
ఇక ఈ సినిమా మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్ గా రూపొందిందని తెలుస్తుంది. ఇందులో బెల్లంకొండ గణేష్ బాలమురళి పాత్రలో కనిపించాడు. ఇక వర్ష భాగ్యలక్ష్మి పాత్రలో కనిపించింది. బాల మురళి ఒక స్వాతిముత్యం లాంటోడు అని చెప్పవచ్చు. బాలమురళి భాగ్యలక్ష్మిని తొలిచూపులతోనే ఇష్టపడ్డ అతను చివరికి తను ప్రేమించిన భాగ్యలక్ష్మి ని పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది కథ. డైరెక్టర్ లక్ష్మణ్ కే కృష్ణ ఈ తరం ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని మంచి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుందని గణేశ్ కూడా బాగా నటించాడని ప్రేక్షకులు చెబుతున్నారు.
Swathimuthyam Movie Review : గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ మధ్య స్వాతిముత్యం
అయితే ప్రతి విజయదశమికి టాలీవుడ్ లో సినిమాల మధ్య కాంపిటీషన్ అనేది ఎప్పటి నుంచే వస్తున్నదే. కాగా ఈ సారి బరిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ” గాడ్ ఫాదర్ ” , కింగ్ అక్కినేని నాగార్జున ” ది ఘోస్ట్ ” సినిమాలు ఉండడంతో ఆడియన్స్ అంతా ఎంతో ఆత్రుతగా మూవీల రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మూడు సినిమాలలో చిరు, నాగ్ లు అగ్రహీరోలు కావడం ఎక్కువ థియేటర్ లు వారి సినిమాలకే దక్కడం జరిగింది. అలానే గాడ్ ఫాదర్, ఘోస్ట్ చిత్రాలకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో ఈ మూవీ పరిస్థితి ఏంటా అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.