Swathimuthyam: ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ రెండో తనయుడు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు… బెల్లంకొండ గణేశ్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనున్నాడు. దసరా కానుకగా నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. డైరెక్టర్ లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ” స్వాతిముత్యం ” అనే సినిమాతో ఈ యంగ్ హీరో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నాడు. కాగా ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించాడు. విజిల్, మిడిల్ క్లాస్ మెలోడీస్ ఫేమ్ వర్ష బొల్లమ్మ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈరోజు దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ప్రత్యేకంగా మీకోసం…
ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందినట్లు తెలుస్తుంది. ఇందులో బెల్లంకొండ గణేష్ స్వాతిముత్యం లాంటి వ్యక్తి పాత్రలో నటించారు. వర్ష భాగ్యలక్ష్మి పాత్రలో కనిపించింది. బాలమురళి భాగ్యలక్ష్మిని తొలిచూపు లోనే ఇష్టపడతాడు. ఇక తన ప్రేమ గురించి చెప్పడానికి ఎన్నో తంటాలు పడతాడు. చివరికి భాగ్యలక్ష్మి తన ప్రేమకు ఒప్పుకొని వారి పెళ్లికి కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకుంటారు. అయితే అలాంటి సమయంలో బాలమురళి అనుకోని సమస్యలో చిక్కుకొని పెళ్లి ఆగిపోతుంది. అయితే అతనికి ఎదురైన సమస్య ఏంటి ? తను ప్రేమించిన భాగ్యలక్ష్మిని పెళ్లి చేసుకుంటాడా లేదా మిగిలిన కథగా తెలుస్తుంది.
Swathimuthyam: బెల్లంకొండ గణేష్ తొలి సినిమా….
ఇందులో తొలిసారిగా నటించిన బెల్లంకొండ గణేష్ తన పాత్రతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడని చెబుతున్నారు. ఈ సినిమాలో కామెడీ, ట్విస్ట్ లు అన్నీ హైలెట్ గా ఉన్నాయని… ఇక సాగర్ మహతి అందించిన మ్యూజిక్ కూడా సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచిందని ప్రేక్షకులు చెబుతున్నారు. కానీ ఈ తరంలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుందని ఓటిటికి బాగా సూట్ అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.