బెల్లంకొండ గణేష్ బాబు హీరోగా, వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం స్వాతిముత్యం. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా, కామెడీ టచ్ తో ఈ మూవీ తెరకెక్కింది. లక్ష్మణ్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక గాడ్ ఫాదర్, ఘోస్ట్ సినిమాలతో పాటే ఈ మూవీ కూడా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. బెల్లంకొండ శ్రీను తమ్ముడు గణేష్ అనే విషయం అందరికి తెలిసిందే. అయితే అన్నయ్య తరహాలో గ్రాండ్ గా లాంచ్ కాకుండా చాలా సింపుల్ గా కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.
ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ ఉంది. సితార ఎంటర్టైన్మెంట్ ఈ మూవీని నిర్మించింది. కామెడీ కంటెంట్ ని ఇష్టపడే వారికి ఈ సినిమా భాగా కనెక్ట్ అవుతుందని నిర్మాత నాగ వంశీ చాలా నమ్మకంగా చెబుతున్నారు. అలాగే ఈ సినిమాలో మెయిన్ స్టొరీ లైన్ స్పర్మ్ డొనేషన్ బేస్ లో ఉంటుందని రివీల్ చేసేసాడు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ ఫుల్ కామెడితో బాగానే ఆకట్టుకుంది. ఈ నేపధ్యంలో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇన్నోసెంట్ హీరో పాత్రలో గణేష్ బాగానే పెర్ఫార్మ్ చేసినట్లు కనిపిస్తుంది.
గతంలో స్పెర్మ్ డొనేషన్ నేపధ్యంలో విక్కీ డోనర్ అనే సినిమా హిందీలో వచ్చింది. అది మంచి హిట్ అయ్యింది. ఆ సినిమాని సుమంత్ హీరోగా తెలుగులో నరుడాడోనారుడా అనే టైటిల్ తో రీమేక్ చేశారు. తెలుగులో ఫ్లాప్ అయ్యింది. అయితే ఇప్పుడు అదే మెయిన్ పాయింట్ గా స్వాతిముత్యం మూవీ రాబోతుంది. ప్యూర్ ఫామిలీ ఎంటర్టైనర్ గా అలరిస్తూనే అంతర్లీనంగా ఈ అంశాన్ని దర్శకుడు లక్ష్మణ్ కె చెబుతున్నట్లు ట్రైలర్ బట్టి అర్ధమవుతుంది. మరి ఈ మూవీ ఏ మేరకు ప్రేక్షకులని అలరిస్తుంది అనేది చూడాలి.