Sushanth Singh Rajput : కై పో చీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన రెండేళ్ల తర్వాత, హై ప్రొఫైల్ కేసులో పోస్ట్‌మార్టం నిర్వహించిన బృందంలో ఒకరైన కూపర్ హాస్పిటల్ ఉద్యోగి రూప్ కపూర్ షా , సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని అతడిది హత్య అని తాజాగా ఆరోపించారు. దీనితో ఈ విషయం సంచలనంగా మారింది. అతని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోసారి సుశాంత్ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ నెట్టింట్లో ప్రారంభమయ్యాయి.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించినప్పుడు, కూపర్ హాస్పిటల్‌లో పోస్ట్‌మార్టం కోసం ఐదు మృతదేహాలు వచ్చాయని , మేము పోస్ట్‌మార్టం చేయడానికి వెళ్ళినప్పుడు, ఐదు మృతదేహాలలో ఒకటి సుశాంత్ దని , అతని శరీరంపై అనేక గుర్తులు ఉన్నాయని ఉన్నాయని రూప్ కపూర్ ఓ మీడియా ఇంటర్వ్యూ లో తెలిపారు. అతని మెడపై రెండు మూడు గుర్తులు కూడా ఉన్నాయన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అతని మృతదేహం చిత్రాలను క్లిక్ చేసేందుకు బృందానికి మాత్రమే అనుమతినిచ్చారని తెలిపారు.

జూన్ 14, 2020న, నటుడు బాంద్రాలోని తన నివాసంలో ఉరివేసుకుని కనిపించాడు. అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పట్లోనే అతడిది ఆత్మహత్య కాదని అతడిని హత్య చేశారని కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, ఇంత కాలం గడిచినా అతని మరణం అంతుపట్టని మిస్టరీగా మిగిలిపోయింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని సుశాంత్ సోదరి కూడా పలు మార్లు చెప్పింది. హీరోయిన్ రియా చక్రవర్తితో సహా అనేక మందిపై ఆమె ఆరోపణలు గుప్పించింది. సెలబ్రిటీలు కూడా
సుశాంత్ సోదరిని సపోర్ట్ చేసారు.