Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ స్టార్ట్ అయ్యి అప్పుడే రెండు వారాలు కావస్తోంది. రేపే వీకెండ్ కావడంతో.. హౌస్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది..? సస్పెన్స్ గా మారింది. ఇదిలా ఉంటే ఈ సీజన్ టైటిల్ రేసులో ప్రారంభంలో కొంతమంది పేర్లు వినబడటం జరిగింది. ఆ పేర్లలో సూర్య కూడా ఒకరు. హౌస్ లో అందరికంటే హైట్ కావడంతో పాటు మంచి పర్సనాలిటీ ఉండటంతో.. పాటుగా ఎంటర్టైన్మెంట్ అందించే కంటెస్టు కావడంతో గ్యారెంటీగా సూర్య హౌస్ లో రాణిస్తారు అని అందరూ ముందు భావించారు.
కానీ ఇటీవల సూర్య ఆట తీరు పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా అర్ధరాత్రి పూట ఆరోహితో పనీపాటా లేని మీటింగ్ లు పెట్టడం వల్ల మనోడికి పెద్ద మైనస్ అయిపోయిందని అంటున్నారు. ఆరోహితో అర్థం పర్థం లేని గొడవలు డిస్కషన్ సూర్య పెట్టుకుంటున్నాడని బయట బ్యాడ్ టాక్ నడుస్తోంది. ఆరోహి ఎలిమినేట్ అయితే గాని సూర్య గేమ్ మారదని అంటున్నారు.
లేకపోతే ఈ తాతాంగం వల్ల సూర్యకి బ్యాడ్ నేమ్ రావడం గ్యారెంటీ అని బయట ఆడియన్స్ నుండి వస్తున్న టాక్. ప్రస్తుతం హౌస్ లో సూర్యకి మంచి పేరుంది. ఆటపరంగా కంటే ఎవరైనా ఏదైనా అడిగితే వెంటనే వండి చేసి పెట్టడం చేస్తున్నాడు. ఒక్క ఆరోహి విషయంలో మాత్రం మారకపోతే ఖచ్చితంగా మూల్యం చెలించుకుంటాడు అని అంటున్నారు. ఇంకా టాస్కులు పరంగా.. మరింత స్ట్రాంగ్ గా రాబోయే రోజుల్లో సూర్య రాణించకుండా హౌస్ లో ఆరోహితో మీటింగులు పెట్టుకుంటే.. తొందరగానే సూర్య బయటకు వచ్చేయడం గ్యారెంటీ అనే టాక్ కూడా నడుస్తోంది.