BIGG BOSS: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో అడుగుపెట్టిన సూర్య తనదైన స్టైల్ లో అదరగొట్టేస్తున్నాడు. ఓ వైపు తోటి కంటెస్టెంట్ ఆరోహితో క్లోజ్ రిలేషన్ షిప్ కొనసాగిస్తూనే మరోవైపు బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుల్లో తన ప్రదర్శనతో బిగ్ బాస్ ప్రేక్షకులకు వినోదం పంచుతున్నాడు. ఈ వారం బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ను సూర్య గట్టిగా ఉపయోగించుకోవాలని ఫిక్స్ అయినట్లు కనిపిస్తూనే ఉంది.
బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ కి తెలియకుండా ఆరోహి, సూర్య గట్టి రిలేషన్ కొనసాగిస్తున్నారు. ఒకరికి ఒకరు అర్ధం చేసుకుని ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు వారిద్దరూ ఎవరికి వారు వేరే వాళ్లతో కూడా కనెక్ట్ అయ్యారు. ఈ విషయంలో వారిద్దరి మధ్య బానే డిస్కషన్ జరుగుతోంది. వీరిద్దరి రిలేషన్ గురించి కాసేపు పక్కకు పెట్టి అసలు విషయంలోకి వస్తే…

మంగళవారం బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీదారుల కోసం హోటల్ వర్సెస్ హోటల్ అనే టాస్క్ ను కంటెస్టెంట్స్ కి ఇస్తాడు. ఇందులో చిన్నప్పుడు తన తలకి గాయం తగిలినప్పటి నుండి తను ఎవరో తానే మరిచిపోయాడు. దీంతో అప్పటి నుండి తను ఎవరిలా కావాలనుంటే వారిలా ప్రవర్తిస్తూ ఉండే క్యారెక్టర్ సూర్యది. టాస్క్ స్టార్ట్ అవ్వగానే ముందుగా చిన్నపిల్లాడిలా హౌస్ లో అమ్మాయిల హోటల్ లో ప్రదర్శన ఇస్తాడు.
అక్కడిడో ఆగకుండా అమ్మాయి డ్రస్ వేసుకుని తేడా క్యారెక్టర్ లోకి సూర్య వెళ్లిపోవడంతో అసలైన వినోదం స్టార్ట్ అయింది. ఊ అంటావా మామా ఊఊ అంటావా మావా అని సాంగ్ వేయడంతో పోల్ డ్యాన్స్ తో సూర్య తేడా క్యారెక్టర్ తో అదరగొట్టే ప్రదర్శన ఇస్తాడు. సూర్యతో పాటు మంగళవారం ఎపిసోడ్ లో అందరూ డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేసి ప్రేక్షకులకు వినోదం పంచారనే చెప్పాలి. అక్కడితో ఆగని సూర్య హోటల్ కస్టమర్ క్యారెక్టర్ లోకి వచ్చి ఆరోహితో మసాజ్ చేయించుకునే సీన్ మరీ హైలెట్. ఇలా ఈ వారం స్టార్టింగ్ లోనే సూర్య తనదైన ప్రదర్శన ఇస్తున్నారు. ఇంకా మున్ముందు ఎలా ఉంటుందో చూద్దాం..!