బ్యాటింగ్ వచ్చిన ప్రతిసారీ తన సత్తా చాటుతూ వచ్చిన సూర్య కుమార్ యాదవ్ టాలెంట్ ను,కాన్సిటెన్సీ ను గుర్తించిన సెలెక్టర్లు,కోచ్,కెప్టెన్ ఇండియా తరుపున వన్ డే,టి 20 ఫార్మాట్స్ లో సూర్య కుమార్ కు ఛాన్స్ ఇచ్చారు.ఆ ఛాన్స్ ను చక్కగా వినియోగించుకున్న సూర్య కుమార్ తన బ్యాటింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపి టి 20 వరల్డ్ కప్ టీమ్ లో స్థానం దక్కించుకున్నారు..
ఇక తాజాగా జరుగుతున్న రెండో భాగం ఐపిఎల్ మ్యాచ్ లలో సూర్య కుమార్ యాదవ్ సింగిల్ డిజిట్ స్కోర్ లకు పరిమితం అవుతున్నాడు.దీంతో సూర్య కుమార్ ఫామ్ కోల్పోయాడు.టి 20 వరల్డ్ కప్ టీమ్ లో సూర్య కుమార్ ప్లేస్ రీప్లేస్ అవుతుందన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది.ఇంకా ఈ సీజన్ లో ముంబైకి రెండు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి.ఈ రెండు మ్యాచ్ లలో రాణించి సూర్య కుమార్ ఈ ప్రచారాన్ని కట్టడి చేస్తారా లేక ప్రచారాన్ని నిజం చేస్తారో వేచి చూడాలి.