Bigg boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు మంచి రసవత్తరంగా సాగుతోంది. ఇక ఈ వారమైతే.. మిగిలిన ఏడు వారాలతో చూస్తే హైలైట్ అనే చెప్పాలి. ఎత్తులు.. పై ఎత్తులతో గేమ్ సాగిపోయింది. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఆసక్తికరంగా నడించింది. ఆ తరువాత కెప్టెన్సీ టాస్క్ కూడా ఇంట్రెస్టింగ్‌గానే సాగింది. కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా చివరిగా ఫలితాన్ని ఇంటి సభ్యుల చేతిలో పెట్టారు బిగ్‌బాస్. ఈ రేస్‌లో చివరిగా కీర్తి, శ్రీహాన్, సూర్య ఉన్నారు. వీరు ఒక్కొక్కరిగా కంటెస్టెంట్స్‌తో మాట్లాడి.. తాము ఎందుకు కెప్టెన్ అవ్వాలనుకుంటున్నామో చెప్పాలి.
ముగ్గురి మాటలను విన్న హౌస్ మేట్స్ ఫైనల్‌గా శ్రీహాన్‌ను కెప్టెన్‌గా ఎన్నుకున్నారు. కీర్తి, సూర్య గతంలో కెప్టెన్స్ అయ్యారు. కాబట్టి కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలని మెజారిటీ కంటెస్టెంట్స్ భావించారు. ఇక ఇనయ మాత్రం హైడ్రామా నడిపించింది. తాను ఎవరిని కత్తిలో గుచ్చాలో ముందుగానే ఫిక్స్ అయ్యానని చెప్పి వెళ్లి శ్రీహాన్‌కు గుచ్చింది. దీంతో శ్రీహాన్ చాలా హర్టయ్యాడు. ఇనయ ఇంత డ్రామా నడిపింది ప్రోమో కట్ కోసం అలాగే కంటెంట్ కోసమని అన్నాడు. అంతటితో ఆగకుండా ఇనయపై కోపంతో రగిలిపోయిన శ్రీహాన్ కొన్ని సంచలన కామెంట్స్ కూడా చేశాడు.
వచ్చేవారం ఎవరైన గెస్ట్ వచ్చి ‘నీది- సూర్యది బాండింగ్ మిస్ అవుతున్నాం’ అంటే వెంటనే వెళ్లి ఇనయ అతడితో కలిసిపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదని శ్రీహాన్ పేర్కొన్నాడు. అంటే సూర్యతో బాండింగ్ వల్లే ఇనయ పడిపోయిందంటూ హైపర్ ఆది చెప్పాక వెంటనే తనని తాను మార్చేసుకుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే శ్రీహాన్ మాట్లాడాడు. తానేదో ప్రతిసారి సరదాగా తీసుకుంటాను అని అనుకుంటుందేమో కానీ సరైన సమయం వచ్చినప్పుడు చెప్తానన్నాడు. అన్ని నాటకాలు ఆడుతోందంటూ ఇనయపై మండిపడ్డాడు. వారానికోసారి రంగు మారుస్తోందని.. నమ్మకద్రోహం చేసిందని.. కత్తి గుచ్చినందుకు బాధపడేలా చేస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు శ్రీహాన్.