Bigg boss 6 : ఇనయ.. అర్ధం పర్ధం లేకుండా వాదించినా కూడా ఎదుటి వాడిని మాట్లాడకుండా చేసి తన వాదనను తాను వినిపిస్తుండటం.. అందరూ ఆమెనే టార్గెట్ చేయడంతో ఆమె గ్రాఫ్ బాగా పెరిగిపోయింది. రేవంత్ తర్వాతి స్థానానికి సైతం ఎదిగింది. టాప్ 5లో అమ్మడికి బెర్త్ కన్ఫర్మ్ అనుకుంటున్న సమయంలో అమ్మడు సూర్య పక్కన బెర్త్ కన్ఫర్మ్ చేసుకుని కావల్సినంత నెగిటివిటీని మూటగట్టుకుంటోంది. సూర్యపై క్రష్ ఉందని బిగ్‌బాస్‌కి చెప్పేసింది. అంతటితో ఆగిందా? హగ్గులు, ముద్దులతో రెచ్చిపోతోంది. నైట్ లైట్స్ ఆఫ్ అయ్యాక అతడితో ముచ్చట్లు పెడుతోంది.
ఇంకేం ఇనయ.. ఇప్పటి వరకూ భజన చేసిన వారంతా క్రమక్రమంగా ఆపేయడం ప్రారంభించారు. అసలు అమ్మడు ఈ సారి నామినేషన్స్‌లోకి వస్తే హౌస్‌లో ఉంటుందా? అన్నట్టుగా మారిపోయాయి పరిస్థితులు. అంతలా అమ్మడు సూర్య మాయలో పడిపోయింది. రోజురోజుకీ వీరిద్దరూ ఫెవికాల్ మాదిరిగా అతుక్కు పోతున్నారు. మొన్నటికి మొన్న నైట్ లైట్స్ ఆఫ్ అయ్యాక సూర్యని తన ఒళ్లో పడుకోబెట్టుకుని కబుర్లు చెప్పింది. అంతే బయట అమ్మడిని ట్రోలర్స్ ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. నిబ్బ.. నిబ్బి అంటూ ముద్దు పేర్లు కూడా తగిలించారు.
ఇక ఆరోహి ఉన్నప్పుడు సూర్య ఆమెతోనూ అలాగే చేసేవాడు కదా. పాలు తెచ్చుకుంటే ఇద్దరూ అదే గ్లాస్‌ను షేర్ చేసుకునే వాళ్లు. ఈ విషయంలోనూ వీరిద్దరిపై విమర్శలు మామూలుగా రాలేదు.ఇక ఇప్పుడు ఇనయ, సూర్య కలిసి పొద్దు పొద్దునే ఒకరు లాలీ పాప్‌ను మరొకరు చప్పరిస్తూ ఎంజాయ్ చేశారు. తను తింటూ.. సూర్యతో షేర్ చేసుకుంది ఇనయ. అతను కూడా ఆమె చప్పరించిన లాలీపాప్‌నే చప్పరిస్తూ ఎంజాయ్ చేశాడు. సూర్యకు తన ఇంటి నుంచి లెటర్ వస్తే.. దానినేదో పర్సనల్‌గా చదువుకుందామన్నా అమ్మడు వదలదాయే. వెళ్లి అతడిపై చేతులు వేసి నానా ఛండాలం. ఇలాంటి వారిని చూసే సీపీఐ నారాయణ వంటి వారు బిగ్‌బాస్ హౌస్‌ను అదేదో హౌస్‌తో పోలుస్తూ ఉంటారు.