Bigg boss 6 : పులిహోర రాజా సూర్య ఎట్టకేలకు బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిపోయాడు. అతని ఆట తీరు బాగున్నా కూడా ఆరోహి ఉన్నంత కాలం ఆమెతో ఆమె వెళ్లిపోయాక ఇనయ సుల్తానాతో కలిపిన పులిహోర వ్యవహారం ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది. మరీ ముఖ్యంగా ఇనయ అయితే అతన్ని పట్టుకుని వదిలింది లేదు. అతనికి లవర్ ఉంది అంటుంది. అలాగని ఆగదు.ఈ వారం మొదట్లో సూర్యకు కాస్త దూరంగా ఉంది. ఆ తరువాత వెళ్లి అతనికి దూరంగా ఉండటం తనకే నచ్చలేదని.. భరించలేకపోయానన్నట్టుగా చెప్పుకొచ్చింది.
ఇనయ ధోరణితో జనాలు కూడా విసుగెత్తి పోయారు. శ్రీహాన్ పిట్ట అనడంతో టాప్ 2కి వెళ్లిపోయిన ఇనయ ఆ తరువాత సూర్య వ్యవహారంతో లాస్ట్‌కి పడిపోయింది. ఇక సూర్య అయితే ఏకంగా బయటికే వెళ్లాల్సి వచ్చింది. ఇక సూర్య బయటకు వెళుతుంటే ఇనయ ఓవర్ యాక్షన్ చూసే వారికి నవ్వు తెప్పించింది.ఓ రేంజ్‌లో ఏడ్చేసి ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది. సాధారణంగా ఆదివారం ఎలిమినేషన్ కార్యక్రమం ఉంటుంది. కానీ ఈసారి మాత్రం శనివారమే పూర్తైంది. అయితే సూర్యను మాత్రం ఇవాళే స్టేజ్ పైకి తీసుకొచ్చారు నాగ్.
ఇక ఇవాళ్టి ప్రోమో బయటకు వచ్చింది. దీనిలో నాగ్ సూర్యను పిలిపించారు. స్టేజీపైకి వచ్చాక అతడు ఏం చేశాడనే దానికి సంబంధించిన విషయాలను ప్రోమోలో చూపించారు.ఓ వీడియోలో సూర్య.. గీతూకి బాహుబలి రేంజ్ హైప్ ఇచ్చాడు. ‘నీ గేమ్ నువ్వు ఆడితే అసలు నీకు కాంపిటీషనే లేదు’ అని గీతూకి చెప్పాడు. ఇనయను టాప్ 5లో ఉండాలని కోరుకుంటున్నానన్నాడు. ఇక ఇనయ మాత్రం సూర్య కనిపించడంతో భూమి మీద నిలవలేదు. చేతివేళ్లతో లవ్ సింబల్‌ను చూపించింది ఇనయ. సూర్య కూడా అదే విధంగా సింబల్ చూపించాడు. దీంతో నాగ్.. ఇవన్నీ ఏంటసలు? నాకర్థం కావడం లేదని నవ్వుతూ అనేశారు.