Surekha Vani sensation : తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సురేఖా వాణి. వదినగా, అక్క వంటి ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించింది. అయతే సురేఖా వాణి భర్త చనిపోయిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఆమె సింగిల్‌గానే ఉంటోంది. ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉన్న సురేఖవాణి సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా సురేఖ వాణి మళ్లీ పెళ్లి చేసుకుంటోందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె దానికి తాజాగా ఓ ట్విస్ట్ ఇఛ్చింది. ఆ ట్విస్ట్ కాస్త సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతోంది.
ఇక కూతురు సుప్రీతాతో కలిసి నెట్టింట ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. మోడ్రన్ డ్రస్సుల్లో కూతురితో పోటీపడుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు ఆమె. ఈ క్రమంలో సురేఖ తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా పెళ్లి, బాయ్‌ఫ్రెండ్ వార్తలతో ఎక్కువగా వార్తల్లో ఉంటోంది. ఇటీవలి కాలంలో ఎక్కువగా ఆమెకు రెండో వివాహంపై ప్రశ్న ఎదురవుతూ వస్తోంది. ఎప్పుడూ పెద్దగా ఇంట్రెస్ట్ లేదని చెప్పే సురేఖా వాణి.. ఈసారి మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన ఆమె రెండో పెళ్లిపై స్పందించింది. ‘నాకు రెండో పెళ్లిపై పెద్దగా ఆసక్తిలేదు. కానీ నా కూతురు సుప్రీతా నన్ను మళ్లీ చేసుకోమంటుంది. ఇప్పుడైతే చేసుకునే ఆలోచన లేదు కానీ, భవిష్యత్తులో చేసుకుంటానేమో చూడాలి’ అని చెప్పిది.ః
Surekha Vani sensation : మంచి హైట్, పర్సనాలిటీ, బాగా డబ్బుండాలి..
మీకు నచ్చిన వ్యక్తి దొరికాడా? అని అడగ్గా.. ప్రస్తుతానికి ఎవరు లేరని సమాధానం ఇచ్చింది. అంతటితో ఆగితే బాగానే ఉండేది కానీ.. తనకు బాయ్‌ఫ్రెండ్ కావాలనిపిస్తోందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే అతను తనని బాగా అర్థం చేసుకునేవాడు కావాలని చెప్పింది. ‘మంచి హైట్, పర్సనాలిటి ఉన్న వ్యక్తి నాకు బాయ్‌ఫ్రెండ్‌గా కావాలి. లైట్‌గా గడ్డం ఉండాలి. అతనికి బాగా డబ్బులు ఉండాలి. ముఖ్యంగా నన్ను బాగా అర్థం చేసుకోవాలి. అలాంటి వాడు దొరికి నాకు నచ్చితే అతడినే పెళ్లి చేసుకుంటా’ అని తెలిపింది. సురేఖ చెప్పిన ఈ విషయాలన్నింటినీ వదిలేసిన సోషల్ మీడియా.. బాయ్‌ఫ్రెండ్ కావాలనిపిస్తోందన్న వ్యాఖ్యలను మాత్రం పట్టుకుని కూర్చొంది.