క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటి సురేఖావాణి. సినిమాలలో విభిన్న పాత్రలలో నటించి మెప్పించిన ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో కూతురు సుప్రీతతో కలిసి ఫోటోలు దిగుతూ వాటిని షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే షార్ట్ వీడియోలు కూడా తరుచుగా చేస్తూ కాస్తా హైప్ తెచ్చుకుంది. సినిమాలలో తల్లి పాత్రలు చేస్తున్న సురేఖావాణి బయట మాత్రం హాట్ హాట్ ఫొటోలతో రెచ్చిపోతుంది.
రోజురోజుకి అందంగా తయారవుతూ తన కూతురుకి పోటీ ఇస్తుంది అనే ప్రశంసలు కూడా అందుకుంటుంది. ఆ మధ్య సురేఖావాణి భర్త చనిపోయిన తర్వాత ఒంటరిగా ఉంటున్న కూతురుతో కలిసి ఎక్కువగా విహారయాత్రలు చేస్తూ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తుంది. ఈ మధ్య సురేఖావాణి రెండో పెళ్లి చేసుకోబోతుంది అనే వార్తలు తరుచుగా వినిపించాయి. అయితే వాటికి ఆమె చాలా సందర్భాలలో ఫుల్ స్టాప్ పెట్టింది. ప్రస్తుతం తనకి భర్త అవసరం లేదని బాయ్ ఫ్రెండ్ అవసరం మాత్రం ఉందని బోల్డ్ కామెంట్స్ చేయడంతో పాటు అతనికి ఎలాంటి క్వాలిటీలు ఉండాలో కూడా చెప్పింది.
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇప్పుడున్న హీరోలలో ఎవరికి 100 ముద్దులు ఇస్తారని యాంకర్ వేసిన ప్రశ్నకి ఆమె వెంటనే పవన్ కళ్యాణ్ అని చెప్పింది. పవన్ కళ్యాణ్ కి తాను అభిమానిని అని అతను కనిపిస్తే 100 ముద్దులు ఇస్తానని చెప్పింది. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే సురేఖావాణి వ్యవహారం అంతా ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యి ఉంటుంది. కూతురుతో కలిసి పార్టీలు పబ్ లు అంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే కొంత మంది విమర్శలు చేయగా, మంరికొంత మంది మాత్రం ఆమెపై పొగడ్తలు కురిపిస్తున్నారు.