క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి సురేఖావాణి. ఈమె ఒకానొక సమయంలో ఫుల్ డిమాండ్ ఉన్న క్యారెక్టర్ నటిగా కొనసాగుతూ ఉండేది. బ్రహ్మబంధంకి జోడీగా కామెడీ పాత్రలని వేసింది. అలాగే హీరోయిన్ తల్లి పాత్రలలో కూడా నటించి మెప్పించింది. ఆమె కెరియర్ లో భిన్నమైన పాత్రలు ఎన్నో చేసింది. అయితే గత కొన్నేళ్లుగా సురేఖావాణి సినిమాలలో పెద్దగా కనిపించడం లేదు. ఒక వేళ చేస్తున్న ఏవో చిన్న చిన్న చిత్రాలలో మాత్రమే కనిపిస్తుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈమె ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. భర్త చనిపోయిన తర్వాత కొంత కాలం సైలెంట్ గా ఉంది.
తరువాత కొత్త లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసింది. కూతరుతో కలిసి పబ్ లకి వెళ్తూ సందడి చేస్తుంది.ఎన్నడూ లేని విధంగా హాట్ హాట్ డ్రెస్సులుతో కూతురికి పోటీ ఇచ్చేలా అందాలు చూపిస్తుంది. అలాగే కూతురు సుప్రీతతో కలిసి షార్ట్ డాన్స్ వీడియోలు చేస్తూ సందడి చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో ఆమెని ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా పెరిగింది. ఇక ఆమె రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుందనే ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. అయితే తనని భరించే శక్తి ఎవరికి లేదని, తన అవసరాలని తీర్చగలిగే బాయ్ ఫ్రెండ్ ఉంటే చాలని బోల్డ్ కామెంట్స్ కూడా చేసింది.
ఇదిలా ఉంటే తాజాగా ఆమె నటించిన స్వాతిముత్యం సినిమా సక్సెస్ మీట్ లో సురేఖావాణి మాట్లాడింది. తాను సినిమాలలో నటించడానికి రెడీగా లేనని కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె పేర్కొంది. తాను ఎలాంటి పాత్రలో అయినా నటించడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే అవకాశాలు ఇచ్చే వారు లేరని తన ఆవేదనని తెలియజేసింది. అవకాశాలు ఇస్తే ఏ రోల్స్ అయినా పర్లేదని చెప్పింది. మరి సురేఖావాణి ఆవేదన అర్ధం చేసుకొని ఏవైనా ప్రత్యేక పాత్రలు ఆమెకి ఇస్తారేమో చూడాలి.