Super Star Rajinikanth: సాధారణంగా వయసు పై పడే కొద్ది ఒంట్లో సత్తువ కూడా తగ్గుతుంది.అయితే సినిమా సెలబ్రిటీలు మాత్రం సాధారణ వ్యక్తుల కన్నా వారు మరి కాస్త వయస్సు ఎక్కువగా ఉన్నప్పటికీ ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటారు. ఇలా సెలబ్రిటీలు వయసు పైబడిన చాలా యాక్టివ్ గా ఉండడానికి కారణం కేవలం వారు తీసుకునే డైట్, అని చెప్పాలి. ఇలా ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతోమంది ఆరుపదులు ఏడు పదుల వయసులో కూడా చలాకీగా సినిమాలలో నటిస్తున్నారు.
ఈ క్రమంలోనే కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు రజనీకాంత్ సైతం ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కోలీవుడ్ ఇండస్ట్రీని శాసిస్తున్నారు.ఇక ఈయనకు కేవలం కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా విపరీతమైన అభిమానులు ఉన్నారని చెప్పాలి. అయితే ఈ మధ్యకాలంలో ఈ తలైవా సినిమాలు మాత్రం కాస్త ఆలస్యం అవుతున్నాయని తెలుస్తోంది.
ఒకప్పుడు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసే రజినీకాంత్ ఇప్పుడు రెండు మూడు సంవత్సరాలకు ఒక సినిమా రావడం కూడా గగనమవుతుంది.ఇలా ఈయన సినిమాలు ఆలస్యం కావడానికి గల కారణం రజనీకాంత్ అనారోగ్య సమస్యలని తెలుస్తుంది. ఈయన వయసు పై పడటంతో ఒంట్లో స్టామినా కూడా తగ్గిపోవడంతో తరచూ అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే ఈయన నటించే సినిమాలు కూడా ఆలస్యం అవుతున్నాయి.
Super Star Rajinikanth: వయసు సహకరించలేదా..
ఇక తాజాగా రజనీకాంత్ తమిళంలో అన్నాతై సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రాన్ని తెలుగులో పెద్దన్న టైటిల్ తో విడుదల చేశారు.ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేదని చెప్పాలి.ఇలా ఈయన నటించిన సినిమాలు కూడా ఈ మధ్యకాలంలో వరుసగా ఫ్లాప్ కావడంతో రజనీకాంత్ ఒంట్లో స్టామినా తగ్గిందని అందుకే ముందున్నంత పస ప్రస్తుత సినిమాలలో లేదని కొందరు అభిమానులు భావిస్తున్నారు. అన్నాతై సినిమా తర్వాత ఈయన ఇప్పటివరకు ఎలాంటి చిత్రాన్ని ప్రకటించలేదు.