త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో పూజా హెగ్డే, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇలా ఎప్పటిలాగే త్రివిక్రమ్ ఈ సినిమాని కూడా తన స్టైల్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీలో కథ ఎలా ఉండబోతుంది, మహేష్ బాబు పాత్ర ఎలా ఉంటుంది అనే విషయాలు ఇప్పటి వరకు బయటకి రాలేదు. భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతోనే సినిమా ఉంటుందనే విషయం అయితే వినిపిస్తుంది.
ఇక ఇందులో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుందని తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు. ఇక త్రివిక్రమ్ ఈ మూవీని తెలుగుకి మాత్రమే పరిమితం చేయకుండా సౌత్ లాంగ్వేజ్ లలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఈ నేపధ్యంలో క్యాస్టింగ్ పరంగా అలాగే ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ రీసెంట్ గా పూర్తయ్యింది. ఇక దీనికి సంబందించిన ఒక వార్త ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.
ఈ దసరాకి ఫెస్టివల్ కి మహేష్, త్రివిక్రమ్ సినిమా నుంచి టైటిల్ ఎనౌన్స్ మెంట్ ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఈ సారి కాస్తా పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యే విధంగా సినిమా టైటిల్ ని తన స్టైల్ లోనే త్రివిక్రమ్ సిద్ధం చేసినట్లు టాక్. ఇప్పటి వరకు రకరకాల టైటిల్స్ వినిపించిన అవేమీ కాదని కొత్తగా టైటిల్ ని ప్రెజెంట్ చేయబోతున్నాడనే మాట వినిపిస్తుంది. మహేష్ ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ఎనౌన్సమెంట్ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏది ఏమైనా దసరాకి మహేష్ అభిమానులు పండగ చేసుకునే అప్డేట్ అయితే ఈ సినిమా నుంచి రావడం పక్కా అని ఫిలిం నగర్ సర్కిల్ లో జోరుగా వినిపిస్తుంది.