Super Star Krishna: టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎన్నో విభిన్నమైన కథా చిత్రాలను పరిచయం చేసి ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిన్నటి తరం హీరోలలో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు.ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కృష్ణ ఇందిరా దేవి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇందిరా దేవికి ఇద్దరు కొడుకులు ముగ్గురు కుమార్తెలు సంతానం కలరు.
ఇలా కృష్ణ ఇందిరాదేవిల వారసుడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండస్ట్రీలో అగ్ర హీరోగా వెలుగుతున్నారు. ఇకపోతే కృష్ణ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్న సమయంలోనే ఈయన నటి విజయనిర్మలను వివాహం చేసుకున్నారు. అయితే తను రెండవ పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటి మొదటి భార్యకు విడాకులు ఇచ్చే విజయనిర్మలను రెండో పెళ్లి చేసుకున్నారా అని విషయానికి వస్తే…
కృష్ణ ఇందిరా వివాహం తర్వాత వీరికి ఐదుగురు సంతానం జన్మించిన అనంతరం కృష్ణ విజయనిర్మలను రెండవ వివాహం చేసుకున్నారు.విజయనిర్మల దర్శకత్వంలో కృష్ణ ఎన్నో సినిమాలలో నటించారు. ఆమె తన జీవిత భాగస్వామి అయితే తన కెరియర్ మరింత బాగుంటుందన్న ఆలోచనతో కృష్ణ ఆయన కుటుంబ సభ్యులు ఇందిరా దేవిని ఒప్పించి విజయనిర్మలను రెండవ పెళ్లి చేసుకున్నారు.
Super Star Krishna: ఇందిరా దేవి అనుమతితోనే కృష్ణా రెండవ వివాహం
కృష్ణ ఇందిరా దేవికి విడాకులు ఇవ్వకుండానే విజయనిర్మలను రెండవ వివాహం చేసుకున్నారు. ఈ విధంగా కృష్ణ రెండవ వివాహం చేసుకున్నప్పటికీ ఇందిరా దేవికి ఎలాంటి కష్టం వచ్చినా ఆయన ముందుండేవారు అలాగే కృష్ణ తల్లిదండ్రులు ఇందిరా దేవి దగ్గరే నివాసం ఉండేవారు. ఇలా కృష్ణ విజయనిర్మల పెళ్లి కావడానికి ఇందిరా దేవి అనుమతి కూడా ఉందని తెలుస్తోంది. ఇలా కృష్ణా రెండవ పెళ్లి చేసుకున్న తరువాతనే విడాకులు తీసుకున్నారని తెలుస్తుంది. ఇకపోతే వయసు పై పడటంతో ఇందిరాదేవి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బుధవారం ఉదయం స్వర్గస్తులైనారు. ఈమె మరణ వార్త విన్న కృష్ణ ఎంతో కృంగిపోయారు.