Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణకి నేడు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం కృష్ణ నానక్‌రామ్‌గూడలో నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా వయసు మీద పడటంతో కృష్ణ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.
నేటి ఉదయం ఆయన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కృష్ణ ఆరోగ్యంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఘట్టమనేని ఇంట్లో వరుసగా విషాదాలు నెలకొంటున్న సంగతి తెలిసిందే. కృష్ణ రెండవ సతీమణి ఆయనకు ఎంతో ఇష్టమైన విజయ నిర్మల మరణించారు. ఆ తరువాత కరోనా సమయంలో కృష్ణ పెద్ద కొడుకు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు సైతం కన్నుమూశారు. ఇటీవల మొదటి సతీమణి ఇందిరా దేవి సైతం మరణించారు. స
ఈ వరుస విషాదాలతో కృష్ణ తీవ్రంగా కృంగిపోయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శ్వాస సంబంధిత సమస్యలు సైతం ఆయన్ను చుట్టుముట్టాయి. పైగా చలికాలం కావడంతో ఆయన కనీసం ఇంటి నుంచి బయటకు కూడా రావడం లేదు. ఇక నేడు మరింత ఇబ్బంది తలెత్తడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ న్యూస్ బయటకు రావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.