Super Star Krishna: టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఎదిగిన కృష్ణ మంగళవారం తెల్లవారు జామున కన్నుమూశారు. అనారోగ్య సమస్య తో హైదరాబాద్ గచ్చిబౌలి లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చేరగా.. తీవ్ర అనారోగ్యంతో ఇవాళ చివరి శ్వాస విడిచారు. తెలుగు సినిమా చరిత్రలో ట్రెండ్ సెట్టర్ గా కృష్ణ నిలిచారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సినిమాలు చేసిన కృష్ణ.. వయో భారం కారణంగా ఈ మధ్య బయటకు రావడం లేదు.
తేనెమనసులు సినిమా తో హీరోగా పరిచయం అయిన కృష్ణ.. అంతకు ముందు కొన్ని సినిమాల్లో నటించారు. ఆ తర్వాత వచ్చిన గూడచారి 116 ఆయనకు భారీ హిట్ అందించింది. ఇక అప్పటి నుండి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. దాదాపు 340కి పైగా సినిమాలు చేసిన కృష్ణ.. ఒక్కో ఏడాది 18 సినిమాల వరకు చేసారు అంటే ఆయన క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. తెలుగు సినిమా చరిత్రలో సాహసాల కథలు ఎక్కువగా చేసిన చరిత్ర కృష్ణదే.
Super Star krishna
1968 నుండి 1974 వరకు ఏడాదికి పది సినిమాలు చేసిన ఘనత కృష్ణకు దక్కింది. 1970, 80లలో కృష్ణ హవా బాగా నడిచింది. అప్పుడే కృష్ణ తన వారసులను ఒక్కొక్కరిగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మహేష్ బాబు ని బాల నటుడిగా తన సినిమాల ద్వారా కృష్ణ పరిచయం చేశారు. కాగా ఈ మధ్యనే కృష్ణ సతీమణి ఇందిరా దేవి కాలం చెయ్యడం తెలిసిందే.