పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు,కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ చివరి అంకంకు చేరుకుంది.హైదరాబాద్ లో జరగనున్న ఈ మూవీలో మహేష్ ఈరోజు నుండి పాల్గొనబోతున్నాడు.మేకర్స్ ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ లోపు పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం.ఈ మూవీలో తన పార్ట్ షూటింగ్ పూర్తయ్యాక మహేష్ సంక్రాంతి పండగ పూర్తి అయ్యేవరకు గ్యాప్ తీసుకొని ఆతర్వాత త్రివిక్రమ్ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.డిసెంబర్ లో ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమం ప్రారంభం కానున్నది.
ముందుగా అనుకున్నట్టు వచ్చే సంక్రాంతి బరిలోకి రావాల్సిన సర్కారు వారి పాట మూవీ డేట్ ను తాజాగా చిత్ర యూనిట్ వాయిదా వేసింది.రెండు పెద్ద సినిమాలు ఒకేసారి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడడం సరికాదని భావించిన చిత్ర యూనిట్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ మూవీ కోసం సంక్రాంతి రేసు నుండి తప్పుకొని సమ్మర్ లో రావడానికి సిద్ధమవుతుంది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులను దృష్ఠిలో ఉంచుకొని చిత్ర యూనిట్ త్వరలో ఈ మూవీ అప్డేట్స్ ను విడుదల చేసే ఆలోచనలో ఉందని సమాచారం.మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాల్సివుంది.