Skin Care: చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు, పెద్దలు అందరూ చర్మ సమస్యలతో, ముఖ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వారి ముఖ సమస్యలను తొలగించుకోవడానికి వైద్యులను సంప్రదిస్తూ రకరకాలైన మందులను, సబ్బులను, అలాగే క్రీమ్స్ ను వాడుతుంటారు. కానీ ఒక్కొక్కసారి వాటితో ఎలాంటి లాభం కనిపించదు. అయితే అధికంగా ముఖ సమస్యలకు ఇంటి చిట్కాలే పరిష్కారం. అలాంటి ఓ చిట్కా ఇప్పుడు తెలుసుకోండి. ముఖ సమస్యలకు అవిసె గింజలు ఒక చక్కటి పరిష్కారం.
అవిసె గింజల వల్ల ఎలాంటి చర్మ సమస్య అయినా ఇట్టే మాయమైపోతుంది. అవిసె గింజలు ఎక్కువగా చల్లని ప్రాంతాలలో పండుతుంది. ఇందులో ఫైబర్ పోషకాలు ఎక్కువ. ఇందులో పోషకాలు మరియు సూక్ష్మ పోషకాల యొక్క పవర్ హౌస్. అందుకే ఇది మన ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. ఇందులో ఉండే జ్యూట్ మీ అందాన్ని మెరుగుపరుస్తుంది. మీ చర్మానికి సహజమైన ఆరోగ్యకరమైన మెరుపును అందిస్తుంది. అతి తక్కువ సమయంలోనే చర్మానికి స్పష్టత మరియు కాంతిని అవిసె గింజలు ఇస్తాయి. అవిసె గింజలు చర్మానికి మాత్రమే కాదు హెయిర్ కు కూడా బాగా ఉపయోగపడుతుంది.
ఇందులో ఉన్న ప్రయోజనాల కారణంగా ఫ్లాక్ సీడ్స్ ఇటీవల బ్యూటీషియన్లలో మరింత ప్రజాదరణ పొందింది. మీ చర్మ సంరక్షణకు తగిన సహజ పదార్థం కోసం చూస్తున్నట్లయితే ఫ్లాక్ సీడ్స్ ఉపయోగకరమైనవి. చర్మానికి అవిసెగింజల విత్తనాలు ఉపయోగించడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.
అవి ఏంటో తెలుసుకుందాం..
అవిసె గింజ విత్తనాలు చర్మం వయస్సును తట్టుకొని యవ్వనంగా ఉండేలా ఉపయోగపడతాయి. ఈ గింజలలోని అనేక భావాలు చర్మం పై కనిపించే
గీతలు, ముడతలు, మచ్చలు తొలగించడానికి సహాయపడతాయి. దీన్ని ముఖంపై అప్లై చేయడం వల్ల క్లియర్ స్కిన్ వస్తుంది. స్కిన్ డామేజ్ ని నివారిస్తుంది. అలాగే సహజ యవ్వనాన్ని అందిస్తుంది. అలాగే ఈ అవిసె గింజలు ముఖానికి తేజస్సును ఇస్తోంది. అవిసె గింజల లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది చర్మానికి హానీ కలిగించే ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి సహాయపడతాయి.
ఇది లోపలి నుంచి చర్మానికి మంచి కాంతిని ఇస్తుంది. అలాగే అవిస గింజలు చర్మానికి మాయిశ్చరైజ్ చేస్తుంది. గింజలలో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఇది
మీ చర్మాన్ని తెల్లగా ఉంచడానికి అందంగా మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇవి మొటిమలను రాకుండా తగ్గిస్తుంది. మొటిమలతో బాధపడుతున్న వారికి ఇది ప్రధాన ఎంపిక అని చెప్పవచ్చు. మొటిమలు అలాగే వాటి వల్ల వచ్చే మచ్చలతో చాలామంది బాధపడుతుంటారు. వారు ఈ అవిసె గింజలను ఉపయోగించవచ్చు.
Skin Care: గింజలతో ఫేస్ మాస్ కూడా చేసుకోవచ్చు.
ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలను మరియు కొద్దిగా తేనెను వేసి దాన్ని ఫేస్ కు అప్లై చేసుకొని మాస్క్ లాగా పెట్టుకుని 10, 15 నిమిషాల తర్వాత మంచినీటితో కడిగితే మీ ముఖం అందంగా మరియు కాంతివంతంగా కనిపిస్తుంది.