Sunny Leone : సన్నీ లియోన్ అత్యద్భుతమైన ఫ్యాషన్‌వాది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ బోల్డ్ స్టార్ ఎప్పటికప్పుడు తన ఫ్యాషన్ డైరీస్‌ను పోస్ట చేస్తూ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటుంది. క్యాజువల్ అవుట్‌ఫిట్స్ అయినా, ఫెస్టివ్ కలెక్షన్స్ అయినా చీరకట్టుతో అయినా లెహెంగా సెట్లైనా తనదైన ఫ్యాషన్ ను ప్రమోట్ చేస్తూ ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తుంటుంది. ఈ మధ్యనే తన కూతురు పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన సన్నీలియోన్ మళ్లీ షూటింగ్ పనుల్లో మునిగిపోయింది. తాజాగా ఎంటీవీ స్ప్లిట్ విల్లా టీవీ షో షూటింగ్ కోసం గోవా చెక్కేసింది ఈ చిన్నది. ఈ రియాలిటీ షో 14వ సీజన్ షూట్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. ఈ రియాలిటీ షోకు సన్నీ లియోని హోస్ట్‌గా వ్యవహరిస్తోంది.

Sunny Leone : ఓ వైపు షూటింగ్ తో బిజీ బిజీగా గడుపుతూనే తన షూట్ డైరీస్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తోంది సన్నీ లియోన్. ఫ్యాషన్ డిజైనర్ హౌజ్ బూజీ బటన్‌కు మ్యూస్ గా వ్యవహరించింది సన్నీ లియోన్. గోవా వైబ్స్ ను తీసుకువచ్చే విధంగా కలర్‌ఫుల్ కో-ఆర్డ్ సెట్ వేసుకుంది. పింక్, ఎల్లో, బ్లూ , ఆరెంజ్ షేడ్స్‌లో వచ్చిన మల్టీకలర్ క్రాపెడ్ ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వేసుకుని దానికి జోడీగా పాస్టెల్ పింక్ డెనిమ్ షార్ట్స్‌ను ధరించింది. ఈ అవుట్‌ఫిట్‌తో గోవా బీచ్‌లో సూర్యుడిని ముద్దాడుతున్నట్లుగా హాట్ ఫోటో షూట్ చేసింది సన్నీ. ఈ పిక్స్‌ను నెట్టింట్లో పోస్ట్ చేసి కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపుతోంది.

సన్నీ తన కలర్‌ఫుల్ అవుట్‌ఫిట్‌ను మరింత అట్రాక్టివ్‌గా చూపించేందుకు చెవులకు మల్టీ కలర్డ్ ఇయర్ స్టడ్స్‌ను అలంకరించుకుంది. పాదాలకు బ్రైట్ ఎల్లో కలర్ స్నీకర్స్‌ను వేసుకుంది. బెల్లో ఫాక్స్ హౌజ్ నుంచి సేకరించిన స్టేట్‌మెంట్ వింటేజ్ పింక్ కలర్ గాగుల్స్‌ను ముఖానికి పెట్టుకుంది.

ఫ్యాషన్ స్టైలిస్ట్ హితేంద్ర కపోపరా సన్నీ లియోన్‌కు స్టైలిష్ లుక్స్ అందించగా , మేకప్ ఆర్టిస్ట్ కిన వానిటీ ఈ భామకు అందమైన మేకోవర్ చేశాడు. సన్నీ లియోన్ ఈ ఫోటో షూట్ కోసం మినిమల్ మేకప్‌ను ఎన్నుకుని తన గ్లామరస్ లుక్స్‌తో యూత్‌కు నిద్ర లేకుండా చేస్తోంది.

