Sunny Leone : బోల్డ్ లుక్స్ తో మైండ్ బ్లాక్ చేయడమే కాదు, తన పిల్లలను అల్లారుముద్దుగా పెంచుకోవడం బాలీవుడ్ బోల్డ్ స్టార్ సన్నీ లియోన్ కి బాగా తెలుసు . సినిమా ప్రాజెక్ట్ లతో, హాట్ ఫోటో షూట్స్ తో బిజీ గా ఉంటూనే పిల్లలతో విలువైన సమయం గడుపుతోంది ఈ అందాల బొమ్మ . లేటెస్ట్ గా సన్నీ లియోన్ తన కూతురు నిషా 7వ పుట్టిన రోజు వేడుకలను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది.

ఫ్రెండ్స్ ని ఇంటికి పిలిచి ఫ్యామిలీతో గ్రాండ్ పార్టీ అరేంజ్ చేసింది. ప్రస్తుతం నెట్టింట్లో ఈ పార్టీ పిక్స్ వైరల్ అవతున్నాయి. సన్నీ కూతురికి ఫాలోవర్స్ విషెస్ తెలుపుతున్నారు.

Sunny Leone : ఈ స్పెషల్ అకేషన్ సందర్భంగా సన్నీ లియోన్ కొన్ని క్యాండిడ్ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తున్నాయ్ . సన్నీ లియోన్ భర్త డేనియల్ వెబర్ తన కూతురిని ఏ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అని ఈ పోస్ట్ కింద మెన్షన్ చేసాడు. తన ప్రేమను వ్యక్తం చేసాడు.

మరో పిక్చర్ లో బెలూన్స్, యూనికార్న్ డెకరేషన్ మధ్య సన్నీ తన కూతురిని భుజాన మీద ఎత్తుకుని ఆనందంలో మునిగి తేలుతోంది. ఈ ఫోటో ఫాల్లోవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. బర్త్ డే పార్టీ కోసం సన్నీ వైట్ టాప్ , పింక్ ప్యాంట్ ను వేసుకుంది. బర్త్ డే గర్ల్ నిషా వైట్ కలర్ ప్రిన్సెస్ డ్రెస్ వేసుకుని అదరగొట్టింది.

2011 సంవత్సరం లో సన్నీ లియోన్ , డానియల్ పెళ్లి చేసుకున్నారు. 2017 లో వీరు నిషా ను దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత 2018 లో సరోగసి విధానంలో కవల బాలులను తమ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పారు. సోషల్ మీడియాలో సన్నీకి ఉన్న క్రేజ్ తో పిల్లలకు మంచి పాపులారిటీ వచ్చింది. సినిమాలో బిజీ గా ఉంటూనే పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది సన్నీ లియోన్ . ఈ విషయంలో సున్నీ నీ అందరూ ఫాలో అవ్వాల్సిందే అని అంటున్నారు ఫాలోవర్స్ .



