Sunny leone : బికినీ వేరులో బోల్డ్ లుక్స్ తో కుర్రాళ్ళ మనసు చెదరగొట్టడమే కాదు ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ లోను ఎంతో ట్రెండీగా ఉంటూ అందరినీ ఆకట్టుకోగలనని నిరూపిస్తోంది సన్ని లియోన్. నవరాత్రి వేడుకల్లో భాగంగా రంగురంగుల లెహంగా సెట్ ను ధరించి గార్బా డాన్స్ కోసం సన్నద్ధమైనట్లుగా ట్రెడిషనల్ అవుట్ ఫిట్ తో చెలరేగిపోయింది సన్ని లియోన్. దక్షిణాది నుంచి ఉత్తరం వరకు ప్రతి రాష్ట్రంలో నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి . ఈ ఉత్సవం కోసం మహిళలంతా కూడా అద్భుతమైన వస్త్రాలను ధరించి కనువిందుగా కనిపిస్తున్నారు. తానేం తక్కువ తిన్నాను అంటూ సన్నిలియోన్ కూడా ట్రెడిషనల్ వేర్ తో రెచ్చిపోయింది.

Sunny leone : ప్రకాశవంతమైన రంగులతో డిజైన్ చేసిన దుస్తులు పండుగలో మరింత ఆనందాన్ని నింపుతాయి. అలాంటి ఫెస్టివల్ అనుభూతి తీసుకొచ్చింది సన్నీలియోన్. నవరాత్రి నైట్స్ కోసం సన్నీలియోన్ గోల్డెన్ జరీ డీటెయిల్స్ తో డిజైన్ చేసిన ఎరుపు రంగు లెహంగాను ఎన్నుకుంది. స్లీవ్స్ మీద గోల్డెన్ రేషమ్ త్రేడ్స్ తో ఎంబ్రాయిడరీ చేసిన ఎరుపు రంగు బ్లౌజు వేసుకుంది. దానికి జోడిగా జరీ ఎంబ్రాయిడరీ డీటెయిల్స్ తో డిజైన్ చేసిన పొడువాటి స్కర్ట్ ను వేసుకుంది. ఈ అవుట్ ఫిట్ కి కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేల గోల్డెన్ ఆక్సిడైస్ గాజులను చేతికి వేసుకుంది.

సన్నీ తన కురులను లూజుగా వదులుకొని కనులకు న్యూడ్ ఐ షాడో, బ్లాక్ ఐ లైనర్, పెదాలకు పాస్టల్ పింక్ లిప్ స్టిక్ పెట్టుకుంది. నుదుటన గ్రీన్ కలర్ బొట్టు పెట్టుకుని బంగారు బొమ్మలా కనిపించింది.
ట్రెడిషనల్ అవుట్ ఫిట్ తో కుర్రాల మనసులు చెదరగొట్టడం ఇది మొదటిసారి ఏమీ కాదు అంతకు ముందు దవతి స్టైల్ లో ఉన్న అవుట్ ఫిట్ వేసుకొని యూత్ ను ఫిదా చేసింది. ఈ మల్టీ కలర్ దుస్తుల్లో సన్నిలియోన్ అందాలు రెట్టింపయ్యాయి ఫ్యాషన్ ప్రియులను మరింతగా ఆకట్టుకున్నాయి.

ఈ మధ్యనే జరిగిన వినాయక చవితికి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని కనువిందుగా కనిపించింది సన్నీ లియోన్. పింక్ కలర్ బెల్ బాటమ్ పంజాబీ సూట్ లో చూడచక్కగా కనిపించింది ఈ అందాల భామ.

తన ముగ్గురు పిల్లలు భర్తతో కలిసి వినాయకుడి మందిరం దగ్గర దిగిన ఫోటోలు ఇన్ స్తాగ్రం లో షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకుంది. ఈ పిక్స్ కూడా నెట్ ఇంట్లో తెగ వైరల్ అయ్యాయి.

ఈద్ పండుగకు కూడా ఎత్నిక్ వేర్ లో మెరిసిపోయింది ఈ బ్యూటీ. బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకొని మైండ్ బ్లాక్ చేసింది.
