Sunny leone: క్రేజీ స్టార్ సన్నీ లియోన్ ఏం చేసినా అది ఆశ్చర్యమే! అలాంటి ఆశ్చర్యపరిచే ఓ పాత్రలో అలరించబోతుంది సన్నీ. అయితే ఈ టాపిక్ ఇప్పుడు తెలుగు సినీ ప్రేక్షకులలో చర్చనీయాంశం అయ్యింది. ఎందుకంటే సన్నీ లియోన్ కు ఏమీ వినపడటం లేదట! అంతే కాదు.. తిరిగి మాట్లాడడం కూడా లేదట. ఎందుకంటే ఆమెకు మాటలు రావడం లేదట! ఇది తాను పోషించనున్న ఓ కొత్త పాత్రలోని వేరియేషన్స్.. ఇలా అందర్నీ ఆశ్చర్య పరిచే ఒక వినూత్న పాత్రలో మన ముందుకు వస్తుంది సన్నీ లియోన్. ఇంతకీ ఏంటి ఆ విశేషాలు.. మీరే ఓ లుక్కేయండి.
మంచు విష్ణు హీరో నటించిన ‘జిన్నా’ లో సన్నీ లియోన్ ఓ కథానాయిక. ఈ సినిమాలో రేణుక అనే ప్రత్యేక పాత్రలో సన్నీ కనిపించనున్నారు. సినిమా కథలో భాగంగా రేణుక చెవిటి, మూగ మహిళ. కాబట్టి తాను మాములు పాత్రల్లా మాట్లాడడం, వినడం చేయలేదుగా.. అందుకే ఈ పాత్ర చేయడం తనకు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించిందని, ఇలాంటి పాత్రలు నటీనటుల్లో మరింత ఉత్సాహాన్ని, ఆసక్తిని కలుగజేస్తాయని సన్నీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.
ఇక ఈ సినిమా గురించి సన్నీ లియోన్ తన అభిప్రాయాన్ని ఇలా వెలిబుచ్చింది.. ”తెలుగులో నేను నటించిన ఫుల్ లెంత్ సినిమా ‘జిన్నా’. కరోనా సమయంలో నేను ఈ కథ విన్నాను. సైకలాజికల్ థ్రిల్లర్.. ఇలాంటి కథలు అంటే నాకు చాల ఇష్టం. ఆ కారణంగానే వెంటనే సరే అన్నాను. షూటింగ్ టైమ్‌లో విష్ణుతో కలిసి ఫ్రాంక్ వీడియోస్ చేసాము, వాటికి వచ్చిన రెస్పాన్స్ అద్భుతం అది నేను అసలు మర్చిపోలేను. విష్ణుతో నటించడం చాలా ఆనందంగా ఉంది. షూటింగ్ కోసం వచ్చినప్పుడు విష్ణు, వారి ఫ్యామిలీ మంచి వసతులు కల్పించేవారు” అంటూ చెప్పుకొచ్చింది.
Sunny leone:
సినిమా కథ విషయానికి వస్తే ‘జిన్నా’ అందరికీ నచ్చుతుందని.. ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని చెప్పింది ఈ సుందరి. పాటల్లో ‘జారు మిఠాయి’ సాంగ్ కు ఇప్పటికే మంచి స్పందన లభించింది. ఇక సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి స్పందిస్తూ.. ”నేను నెగిటివ్ కామెంట్స్ చదవను. పాజిటివ్ కామెంట్స్ మాత్రమే చదువుతా. ముందుకు వెళతా. సోషల్ మీడియాలో ట్రోల్స్.. ఈ సమస్య నా ఒక్కరికి మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరికీ వస్తాయి” అని పాజిటివ్ గా సమాధానం ఇచ్చింది.