Sunny Leone : బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్ సంపూర్ణమైన ఫ్యాషన్‌వాది. ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి అద్భుతమైన స్నిప్పెట్‌లను రోజూ పోస్ట్ చేస్తూ ఫ్యాషన్ ప్రియులను అలరిస్తుంటుంది. ఎత్నిక్ అవుట్‌ఫిట్స్ , ఫెస్టివల్ డ్రెసెస్ దగ్గరి నుంచి క్యాజువల్, ఫారల్ లుక్ వరకు అన్ని అవుట్‌ఫిట్స్‌లో తన దైన స్టైల్స్‌ను ప్రదర్శిస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తుంటుంది. అంతే కాదు ఎప్పటికప్పుడు డిజైనర్ అవుట్‌ఫిట్స్ ధరించి హాట్ ఫోటో షూట్‌లు చేసి ఆ చిత్రాలతో తన అభిమానులనతో పంచుకుని వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది. తాజాగా ఈ చిన్నది షార్ట్ డ్రెస్‌లో కనిపించి పిచ్చక్కించింది. తన నాజూకు అందాలతో మెస్మరైజ్ చేసింది.

Sunny Leone : సన్నీ లియోన్ ఫ్యాషన్ డిజైనర్ నిధి మల్హన్‌కి మ్యూజ్ గా వ్యవహరించింది. ఈ హాట్ ఫోటో షూట్ కోసం డిజైనర్ షెల్ఫ్‌ల నుండి గ్రీన్ కో-ఆర్డ్ సెట్‌ను ఎంచుకుంది సన్నీ.

ఆకుపచ్చని స్లిప్ కార్సెట్ క్రాపెడ్ టాప్ ను తెల్లటి నక్షత్రాలతో ముద్రించబడిన ఆకుపచ్చ రంగు షార్ట్స్ ను వేసుకుని తన అందాలను ప్రదర్శించింది. అనంతరం గ్రీన్ టాప్ మీదుగా పాస్టెల్ పింక్, వైట్ డీటెయిల్స్‌తో డిజైన్ చేసిన గ్రీన్ క్రాపెడ్ జాకెట్ ను వేసుకుంది. చెవులకు హూప్ ఇయర్ రింగ్స్, పాదాలకు వైట్ స్నీకర్స్ వేసుకుని ఎంతో హాట్ గా కనిపించింది ఈ బోల్ట్ బ్యూటీ.

ఫ్యాషన్ స్టైలిస్ట్ హితేంద్ర కపోపరా సన్నీకి స్టన్నింగ్ లుక్స్‌ను అందించాడు. తన బ్రౌనిష్ కురులతో అందమైన రెండు పిలకలను వేసి క్యూట్ లుక్స్ అందించాడు. కనుబొమ్మలను డార్క్ చేసుకుని , కనులకు ఐ లైనర్, మస్కరా దిద్దుకుని పెదాలకు రెడ్ లిప్ షేడ్ ను పెట్టుకుని గ్లామరస్ లుక్స్‌తో ఇంటర్నెట్‌లో ట్రాఫిక్ జామ్ చేసింది. ఈ గ్రీన్ అండ్ గ్రీన్ లుక్ లో సన్నీ లియోన్ ఎంతో ఫ్రెష్ గా కనిపించింది.

సన్నీ ఫ్యాషన్ డైరీస్ రోజు రోజుకు మరింత మెరుగ్గా మారుతున్నాయి. రీసెంట్‌గా ఈ భామ వైట్ టాప్, గ్రీన్ షార్ట్ స్కర్ట్ వేసుకుని బీచ్‌సైడ్ చేసిన హాట్ పిక్స్ ఫ్యాషన్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

చమత్కారమైన రంగులు, గ్రాఫిక్ ప్రింట్‌లలో ప్రింట్ చేయబడిన తెల్లటి క్రాపెడ్ టాప్ ను వేసుకుని సన్నీ ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. ఈ టాప్‌ను సిల్వర్ బెల్ట్‌తో వచ్చిన ఆకుపచ్చని పొట్టి స్కర్ట్‌తో జత చేసింది. వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో ఉన్న ఈ అవుట్‌ఫిట్ సన్నీ ఫిగర్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా కనులకు గ్రీన్ కలర్ గాగుల్స్, చేతికి మల్టీకర్ బ్రేస్‌లెట్ తో పాటు వాచ్ పెట్టుకుని చెవులకు మల్టీ కలర్ ఇయర్స్ ను అలంకరించుకుని కలర్‌ఫుల్‌గా రంగు రంగుల సీతాకోకచిలుకలా కనిపించి కుర్రాళ్లను కవ్వించింది.
