Sunny leone : అప్ కమింగ్ మూవీ గిన్న ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడిపేస్తోంది బోల్డ్ హీరోయిన్ సన్ని లియోని. ఈ తెలుగు మూవీ ప్రమోషన్ కోసం దేశవ్యాప్తంగా చుట్టేస్తోంది ఈ చిన్నది. ఓవైపు ప్రమోషన్స్ చేస్తూనే మరోవైపు సన్నీ తన ఫ్యాషన్ స్టైల్స్ తో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటుంది. ఈ భామ తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో లేటెస్ట్ ఫ్యాషన్ డైరీ నుంచి స్నిప్పెట్స్ ను పోస్ట్ చేస్తూ ఫాన్స్ ను మంత్రముగ్ధులను చేస్తుంది. తాజాగా పింక్ కలర్ అవుట్ ఫిట్ తో పాటుగా ప్యాంట్ షర్ట్ ధరించి ట్రెండీ లుక్ లో కనిపిస్తూ యూత్ ను కవ్విస్తోంది. ఈ పిక్స్ ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతున్నాయి.

సన్నీ లియోని ఫ్యాషన్ అభిరుచి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచుగా హాట్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ అందరి మైండ్ బ్లాక్ చేస్తూ ఉంటుంది . అయితే ఎప్పుడూ తన అందాల ఆరబోతతో చెలరేగిపోయే సన్నీ ఇప్పుడు మాత్రం కాస్త కంఫర్ట్ గా ఉండే సాంప్రదాయబద్దంగా కనిపించే దుస్తులను ధరించి అందరిని అవాక్కు చేస్తోంది. తెలుగులో ఈ చిన్నది చేస్తున్న గిన్న మూవీ ప్రమోషన్స్ కోసం చుడిదార్, ప్యాంట్ షర్ట్ ను వేసుకుని తెలుగు ప్రేక్షకులు కంఫర్ట్ గా ఫీల్ అయ్యేలా చేస్తోంది.

Sunny leone : గిన్న ప్రమోషన్స్ కోసం సూరత్ వెళ్లిన సన్నీ క్యాజువల్ నియాన్ టాప్, దాని పైకి వైట్ జాకెట్ వేసుకుంది. ఈ రెండింటికి జోడీగా జీన్స్ వేసుకొని అదర గొట్టింది. మ్యాష్ బై మాల్వికా ష్రాఫ్ కు మ్యూస్ గా వ్యవహరించింది సన్నీ. నలుపు రంగులో ఉన్న హై వేస్టేడ్ జీన్స్ లో గ్రాఫిక్ ప్రిన్స్ తో వచ్చిన గ్రీన్ టాప్ లో సన్నీ స్టన్నింగ్ లుక్ తో అదరగొట్టింది . క్రాప్డ్ వైట్ జాకెట్ తో తన లుక్ ని మరింత ట్రెండీగా మలుచుకుంది ఈ సుందరి. ప్రముఖ స్టైలిస్ట్ హితేంద్ర కపోపర సన్నీకి స్టైలిష్ లుక్స్ ను అందించాడు. మేకప్ ఆర్టిస్ట్ కిన్ వానిటీ ఈ భామ అందాలకు మరింత మెరుగులు దిద్దాడు.

ఇక పింక్ అండ్ ఆరెంజ్ కలర్స్ లో ఉన్న అద్భుతమైన మరో ట్రెడిషనల్ అవుట్ ఫిట్ తో యూత్ ను ఫిదా చేసింది సన్నీ. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ హౌస్ ఈజ్ నుంచి సిల్క్ అవుట్ ఫిట్ ను ఎన్నుకుంది. హైదరాబాద్ లో జరిగిన ప్రమోషన్ లో నారింజ , గులాబీ రంగులో ఉన్న ఈ అవుట్ ఫిట్ ని ధరించి అందరి చూపులను తన వైపు తిప్పుకుంది. పింక్ క్రాప్డ్ టాప్ దానికి జోడిగా పింక్ సిల్క్ వైడ్ లెగ్స్ పల్లాజో వేసుకుంది. టాప్ మీద నుంచి సిల్వర్ రేషమ్ త్రేడ్స్ చారలతో డిజైన్ చేసిన పఫ్ఫి ఫుల్ స్లీవ్స్ ష్రగ్ ను ధరించింది. ఈ అవుట్ ఫిట్ లోనూ కలర్ ఫుల్ గా కనిపించి కెవ్వుమనిపించింది ఈ బోల్డ్ సుందరి. ఈ పిక్స్ కూడా తన ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నాయి.