రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియాలో రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. రిలీజ్ అయిన అన్ని బాషలలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని వెయ్యి కోట్లకి పైగా ప్రపంచ వ్యాప్తంగా కలెక్ట్ చేసింది. బాహుబలి, దంగల్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఆ స్థాయిలో కలెక్ట్ చేసిన సినిమా ఇదే అని చెప్పాలి. ఈ సినిమా హిట్ తో రామ్ చరణ్, తారక్ క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది.
హాలీవుడ్ టెక్నిషియన్స్ సైతం ఆర్ఆర్ఆర్ సినిమా మేకింగ్, కంటెంట్ పై ప్రశంసలు కురిపించారు అంటే సినిమా ఎంత సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒటీటీలో రిలీజ్ అయిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందింది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాన్ని తాజాగా నిర్మాత సునీత తాటి రివీల్ చేశారు. కొరియన్ రీమేక్ గా సుదీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన శాకినిడాకిని సినిమా ప్రమోషన్ లో భాగంగా సునీత తాటి ఈ విషయాన్ని చెప్పారు.
ప్రపంచం అంతా కొరియన్ మూవీస్ రీమేక్ కోసం పరుగులు పెడుతూ ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమాకి కొరియన్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ నేపధ్యంలో ఆర్ఆర్ఆర్ కొరియన్ రీమేక్ రైట్స్ కోసం అక్కడి మేకర్స్ నుంచి భారీ ఆఫర్ వచ్చింది. ఈ విషయాన్ని రాజమౌళికి చెప్పినపుడు ఆయన వెంటనే నమ్మలేదు. నేను ప్రస్తుతానికి సస్పెన్స్ లో ఉన్నా అనే రియాక్సన్ ఇచ్చారు అని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ప్రతి అమ్మాయి జీవితానికి శాకిని డాకిని మూవీ దగ్గరగా ఉంటుందని చెప్పుకొచ్చింది.