Sunflower Seeds: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణాలు ఎవతేనేం.. మన జీవన విధానాన్నే మార్చేవేశాయి. దానివల్లే ఈ అధిక బరువు, కొలెస్ట్రాల్, షుగర్ వంటి సమస్యలు కూడా అధికం అయిపోయాయి. ఇక షుగర్, లావుగా ఉండడం వంటివి ఈ రోజుల్లో కామన్ గా మారినవి. దీనితో చాలా మంది తిరిగి సహజంగా లావు తగ్గే మార్గాలు, షుగర్ తగ్గే పద్దతుల కోసం అన్వేషణ ప్రారంభించారు.
ఇక జిమ్ములు, వ్యాయామాలు, కసరత్తులు చేయడం జీవనశైలిలో భాగంగా మార్చుకోవడానికి అందరు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది డైటింగ్, ప్రత్యేక ఆహారపు అలవాట్లు చేసుకుంటున్నారు. దీనివల్ల కొంతమేర ఫలితాలు ఉన్నా, ఆశించిన స్థాయిలో ఫలితాలు లేక నిరాశ చెందుతున్నారు ఎక్కువ మంది. దీనితో కొందరు మొత్తానికే తినడం మానేయడం, అధిక కసరత్తులు చేయడం చేయడం చేస్తున్నారు.
ప్రొద్దు తురుగుడు విత్తనాలు..
అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారికి ప్రొద్దుతిరుగుడు పువ్వు గింజలు ఒక చక్కటి బెషధంలా పనిచేస్తాయి. ఈ ప్రొద్దుతిరుగుడు విత్తనాలను కూసాలు అని కూడా పిలుస్తారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి మంచి ఫలితాలను అందిస్తాయి. ఇక వీటితో షుగర్ ఉన్నవారు కూడా మంచి ఫలితాలు పొందవచ్చు.
ఈ పొద్దుతిరుగుడు గింజలు శరీరంలో ఉండే టాక్సిన్స్ ను తొలగిస్తాయి. అంతేకాకుండా పొద్దుతిరుగుడు పువ్వులను రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల తొందరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరంలోని అదనపు కొవ్వను వేగంగా కరిగిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ ప్రొద్దుతిరుగుడు విత్తనాలను తినవచ్చు. వీటిని తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.