ఒకప్పుడూ నా వీడియోస్ ను లైక్ చేయండి షేర్ చేయండి అంటూ అందరినీ కోరిన డ్యాన్సర్ శరత్ అయ్యయ్యో వద్దమ్మా అంటూ చేసిన వీడియో వైరల్ అవ్వడంతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయాడు. మీమర్స్ కు మంచి కంటెంట్ అయిపోయాడు అలాంటి శరత్ పై తాజాగా సుమారు 15 మంది దాడి చేశారు.దీంట్లో శరత్ తీవ్రంగా గాయపడ్డాడు.ఈ విషయం బయటికి రావడంతో టీ యాడ్ ఇమిటేట్ చేసి శరత్ హిజ్రాలను అవమానించడనే కారణంతో అతడ్ని హిజ్రాలు టార్గెట్ చేశారు కొట్టారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
తాజాగా దీనిపై ఒక తెలుగు ప్రముఖ న్యూస్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన శరత్ అదంతా తప్పుడు ప్రచారమని క్లారిటీ ఇచ్చాడు.గతంలో లాల్ బాజర్ లో ఉన్న సాయి అనే వ్యక్తి తన స్నేహితుడు భార్యకు అసభ్యకర మెసేజ్ లు పంపేవాడని ఈ విషయంపై అతన్ని తీసుకొచ్చి నాలుగు తన్నమని ప్రస్తుతం ఆ కేసులో జైలు నుండి బెయిల్ మీద వచ్చిన తాను టిఫిన్ తీసుకురావడానికి ఒంటరిగా వెళ్తుంటే సాయి తన తమ్ముడు హరి మిగతా వారితో కలిసి టార్గెట్ చేసి కొట్టారని తన కళ్ళు మూసేసి వెనక నుండి ముందు నుండి కొడుతూనే ఉన్నారని ఆ సమయంలో అక్కడికి కానీ పోలీసులు రాకుంటే వాళ్ళ వద్ద ఉన్న చాకులతో తనని చంపేసుంటారు అని శరత్ తన భయాందోళనను వ్యక్తం చేశాడు.
తను సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం వల్ల తనకి సినిమాలు చాలా అవకాశాలు వస్తున్నాయని దాన్ని ఓర్వలేకనే వాళ్ళు నన్ను ఇలా కొట్టారని అన్నాడు.సోషల్ మీడియాలో కొందరు తనని కావాలని టార్గెట్ చేసి హిజ్రాల అవమానించేలా వీడియో చేసినందుకే అతన్ని హిజ్రాలు కొట్టారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు నాకు హిజ్రాలంటే చాలా గౌరవం వాళ్ళతో నేను చాలా మంచిగా ఉంటాను వాళ్ళు కూడా నాకు అక్క చెల్లెల్లు లెక్కే మరి అలాంటి వారిని నేను ఎందుకు అవమానిస్తాను అలాంటి వీడియోస్ నేను చేయలేదు చేయను యాడ్ లో అన్న సుఖీభవ అనేది వైరల్ కాలేదు నేను వైరల్ చేశాను యాడ్ తీసినప్పుడు మీకు రాని కోపాలు,రోషాలు నేను చేస్తే వస్తాదా ఎవరైనా ఎదగాలి అనుకుంటే ఇలా తొక్కే ప్రయత్నాలు చేయడం ఏంది బ్రదర్ అని బాధపడ్డాడు.
ఇక ఇదే ఇంటర్వ్యూ లో పాల్గొన్న శరత్ తండ్రి తన చిన్నకొడుకు చెబితే శరత్ ను కొట్టారన్న విషయం తెలిసిందని పోలీస్ స్టేషన్ లో అటెంప్ట్ టూ మర్డర్ కింద కేసు రిజిస్టర్ చేశామని నా కొడుకు చెప్పిన ఇద్దర్నీ పోలీసులు పట్టుకుంటే మిగతా వారెవరో బయటికి వస్తారని ఆయన అన్నారు.ఈ ఇంటర్వ్యూలో శరత్ వాసిపోయిన కన్నుతో కనిపించాడు.ప్రస్తుతం పోలీసులు శరత్ పై దాడి చేసి వారిని పట్టుకునే పనిలో బిజీగా ఉన్నారు.