Suhana Khan : ఈ దీపావళి పండుగ ఫ్యాషన్ ప్రియులకు అత్యద్భుతమైన ఫ్యాషన్ ట్రెండ్స్ ను పరిచయం చేసింది. నలుపు రంగు చీరల నుంచి మెరుపులా లెహెంగా సెట్స్ వరకు బాలీవుడ్ తారలు అమేజింగ్ అవుట్ ఫిట్స్ ను తమ ఫిగర్ కు , కలర్ కు తగ్గట్లుగా ధరించి రానున్న సీజన్ కు ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇచ్చేసారు. యువ కథానాయికలు సారా అలీ ఖాన్, అనన్య పాండే , జాన్వీ కపూర్, రకుల్ , పూజ హెగ్డే లు ఒకరిని మించి మరొకరు డిజైనర్ దుస్తుల్ని వేసుకుని కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేసారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ అత్యద్భుతమైన చీరను కట్టుకుని అదరగొట్టేసింది. ఫెస్టివ్ సీజన్ ఫ్యాషన్ ను పర్ఫెక్ట్ గా ఫాలో అవుతూ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తోంది.

Suhana Khan : తాజాగా చేసిన దివాలీ ఫ్యాషన్ ఫోటో షూట్ కోసం సుహానా ఖాన్ గోల్డెన్ కలర్ చీరను కట్టుకుని మంత్రముగ్ధులను చేసింది. సీక్విన్స్ డీటైల్స్ తో వచ్చిన ట్రాన్స్ పరెంట్ చీరను కట్టుకుని తన లేలేత అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఫాల్గుణి షానే పీకాక్ చీరలో మెరిసిపోయింది సుహానా ఖాన్ . మిరిమిట్లు గొలిపే హారిజాంటల్ సీక్విన్ డిజైన్ బార్డర్ శారీకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది.

ఈ చీరకు తగ్గట్లుగా పంగ్లింగ్ నెక్ లైన్ కోల్డ్ షోల్డర్ డిటైల్స్ తో డిజైన్ చేసిన స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని క్లివేజ్ షో చేస్తూ కుర్రాళ్ళ మతులు పోగొట్టింది. తన అందాలతో స్టార్ హీరోయిన్ లను బీట్ చేసింది సుహానా ఖాన్ . మెడలో ఎలాంటి ఆభరణాలు వేసుకోకున్నా మెరిసిపోయింది. చెవులకు కాంట్రాస్ట్ గా గ్రీన్ కలర్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని అదిరిపోయింది. సింపుల్ మేకప్ తో స్టన్నింగ్ హెయిర్ స్టైల్ తో మెస్మెరైజ్ చేసింది.

చీర కట్టుతో మెరిపించడం ఇది కొత్త కాదు గతంలోనూ గోల్డెన్ శారీ కట్టుకొని అదరగొట్టింది. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన సీక్వీన్ చీరలో తారలా తళుక్కుమంది . ఈ చీరకు మ్యాచింగ్ గా సన్నటి స్ట్రాప్స్ తో వచ్చిన బ్లింగ్ లాడెన్ బ్లౌజ్ వేసుకుంది. పార్టీ ఫ్యాషన్ ను ప్రమోట్ చేసింది.
