Suhana Khan : స్టార్ హీరోయిన్‌లకు కూడా లేని ఫ్యాన్ ఫాలోయింగ్ బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ సొంతం. సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి మిలియన్స్‌లోనే ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్దగా యాక్టివ్‌గా లేకపోయినప్పటికీ కుర్రాళ్ల అటెన్షన్ అంతా ఈ చిన్నదానిపైనే ఉంటుంది. అంతటి అందం సుహానా ఖాన్ సొంతం. అందం అమ్మాయి అయితే అచ్చం నీలా ఉంటుందా అని ఓ కవి పాడిన పాటకు అచ్చుగుద్దినట్లు ఉంటుంది సుహానా ఖాన్. ఎక్కడ ఏది ఉండాలో అక్కడ అది ఉంటుంది. షారుఖ్ ఖాన్, గౌరీఖాన్‌ల అందాన్ని పొనికిపోసుకుని పుట్టినట్లు ఉంటుంది ఈ భామ.

Suhana Khan : తాజాగా సుహానా ఖాన్ తన తల్లి గౌరీ ఖాన్ , షనాయా కపూర్ , మహీప్ కపూర్‌లతో కలిసి హాలిడే వెకేషన్ కోసం దుబాయ్ చెక్కేసింది. దుబాయ్‌లో పాకిస్తాన్‌కు చెందిన తన ఫ్రెండ్ బరీహాను కలుసుకుంది సుహానా. ఈ అకేషన్ కోసం ఫ్లోరల్ డ్రెస్‌ను వేసుకుని అందరి చూపును తనవైపు తిప్పుకుంది సుహానా ఖాన్. తాజాగా ఈ మీట్‌కు సంబంధించిన పిక్‌ను బరీహా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దుబాయ్ రెస్టారెంట్‌లో దిగిన ఈ ఫోటో కింద ఫైనల్లీ మెట్ మై డోపెల్ గ్యాంగర్ సుహానాఖాన్ అని క్యాప్షన్‌ను జోడించింది. దీనితో పాటు #iamsrk, #seeingdouble అని హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

ఈ అకేషన్ కోసం సుహానా వేసుకున్న పూల ప్రింటెడ్ అవుట్‌ఫిట్‌ను బాలీవుడ్ ఫేవరేట్ క్లాతింగ్ లేబుల్ హౌజ్ ఆఫ్ సిబి నుంచి సేకరించింది. ఈ అవుట్‌ఫిట్‌ను బెల్లూసి రోజ్ ప్రింట్ సన్ డ్రెస్ అని పిలుస్తారు. ఈ అవుట్‌ఫిట్ లేబెల్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.12,630. సుహాన్ ఈ ఫ్లోరల్ డ్రెస్ ఇటాలియన్ రివేరా వింటేజ్ వైబ్స్‌ను తీసుకువచ్చింది. తెలుపు రంగులో ఉన్న కాటన్ క్లా్‌త్‌పైన రోజ్ ప్రింట్స్, మిడ్‌రిఫ్ మీద స్మాక్ డీటైల్స్ ప్రత్యేక ఆకర్షణను తీసుకువచ్చాయి. గౌనుకు వచ్చిన హాఫ్ స్లీవ్స్, స్క్వేర్ నెక్‌లైన్, బాడీహగ్గింగ్ డీటైల్స్ సుహానాకు సరిగ్గా సూట్ అయ్యాయి. ఈ అవుట్‌ఫిట్‌ను గార్డెన్ పార్టీస్‌కి , బ్రాంచస్‌కి , పిక్నిక్స్‌కి , ఆఫ్టర్‌నూన్ టీలు ఫ్రెండ్స్ తో వెళ్లేప్పుడు వేసుకోవచ్చు.

ఈ ఫ్లోరల్ అవుట్‌ఫిట్ కు మరింత గ్లామర్‌ను యాడ్ చేసేందుకు సుహానా తన లుక్‌ను ఎంతో స్టైలిష్ గా తీర్చి దిద్దుకుంది. తన కురులను మధ‌్యపాపిట తీసి లూజ్‌గా వదులుకుంది. పాదాలకు స్ట్రాపీ కిట్టెన్ హీల్స్ వేసుకుంది. చెవులకు డైంటీ ఇయర్‌రింగ్స్ పెట్టుకుంది. పెదాలకు గ్లాసీ న్యూడ్ లిప్ షేడ్ వేసుకుని గ్లోయింగ్ స్కిన్‌తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది.