Sudigali sudheer:సుడిగాలి సుదీర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు బుల్లితెర మెగాస్టార్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుదీర్ ఈ మధ్యకాలంలో బుల్లితెర కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నటువంటి సుధీర్ టాలెంట్ గుర్తించిన మల్లెమాల వారు ఈయనకి జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశం ఇచ్చారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుడిగాలి సుదీర్ అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు.
ఇలా ఈటీవీలో మల్లెమాల వారి కార్యక్రమాలు అన్నింటిలోనూ సుదీర్ పెద్ద ఎత్తున సందడి చేసేవారు అయితే మల్లెమాల వారితో వచ్చిన మనస్పర్ధలు కారణంగానో లేదా మరే కారణం వల్లనో తెలియదు కానీ ఈయన మల్లెమాల వారి కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యారు.ఇలా ఈటీవీలో ప్రసారమవుతున్న కార్యక్రమాలకు దూరమైనటువంటి సుధీర్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.ఇకపోతే ఈ కార్యక్రమం కూడా పూర్తి కావడంతో ఏ బుల్లితెర కార్యక్రమాలలోనూ సందడి చేయడం లేదు.
ఇకపోతే సుధీర్ గత కొన్ని రోజులుగా బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉండటం చేత సుధీర్ గురించి పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుధీర్ బుల్లితెరపై సందడి చేయకపోవడానికి ఒక కారణం ఉందని ఆయన ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఈ వ్యాధి కారణంగానే సుధీర్ బయట కనిపించడానికి కూడా ఇబ్బంది పడుతున్నారనీ తెలుస్తోంది.
Sudigali sudheer: ఈ వార్తలన్నీ అవాస్తవాలే..
ఇలా సుడిగాలి సుధీర్ గురించి ఆయన ఆరోగ్యం గురించి వార్తలు రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ అసలు సుధీర్ కి ఏమైంది అంటూ ఆరా తీస్తున్నారు.అయితే మరికొందరు మాత్రం ఎవరు కంగారు పడాల్సిన పనిలేదు ఇవన్నీ కేవలం ఒట్టి పుకార్లు మాత్రమేనని ఒకవేళ సుదీర్ కు నిజంగానే బాగా లేకపోతే ఇదివరకే తన స్నేహితులు ఈ విషయం గురించి అందరితో పంచుకునేవారు అంటూ ఈ వార్తలను పూర్తిగా ఖండిస్తున్నారు.మరి సుధీర్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే సుధీర్ ఈ వార్తలపై స్పందించాల్సి ఉంది.