జబర్దస్త్ కామెడీ రియాలిటీషోతో వెలుగులోకి వచ్చిన టాలెంటెడ్ యాక్టర్ సుడిగాలి సుధీర్. ఈ పేరుతో జబర్దస్త్ తో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను కాంబినేషన్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యారు. జబర్దస్త్ సీజన్ లో బెస్ట్ ఎంటర్టైన్మెంట్ టీంగా వీరి ముగ్గురికి మంచి వచ్చింది. ఇక ఈ మధ్యకాలంలో వీరు ముగ్గురు సినిమాలలో బిజీ అవుతున్నారు. సుడిగాలి సుధీర్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక గెటప్ శ్రీను కమెడియన్ గా సెటిల్ అవుతున్నాడు. ఇక ఆటో రామ్ ప్రసాద్ అయితే రైటర్ గా సక్సెస్ అయ్యే ప్రయత్నంలోఉన్నాడు. ఇక కెరియర్ పరంగా ముగ్గురు కూడా మంచి స్థాయిలోనే ఉన్నారు. ఇదిలా ఉంటే జబర్దస్త్ అంటే కమెడియన్స్ తో పాటు యాంకర్ రష్మి, సుడిగాలి సుధీర్ రొమాన్స్ కూడా అందరికి గుర్తుకొస్తుంది.
ఆన్ స్క్రీన్ పై వీరిద్దరూ పండించే రొమాన్స్ కి విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. సుడిగాలి, సుధీర్, రష్మి నిజంగానే ప్రేమికులు ఏమో అనే విధంగా సోషల్ మీడియలో కూడా వీరి గురించి విస్తృత ప్రచారం నడిచింది. ఇక సుధీర్ ని కూడా అందరూ ప్లే బాయ్ అంటూ తెగ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అది ఎంత వరకు నిజమనేది ఎవరికి తెలియదు. ఇక సుధీర్ ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా అతని కొత్త సినిమా గాలోడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా సుధీర్ ని రష్మి గురించి యాంకర్ అడిగారు. అయితే రష్మితో ఫ్రెండ్ షిప్ మాత్రమే అని చెప్పాడు.
భవిష్యత్తులో ఇద్దరం కలిసి ఒకే సినిమాలో కనిపించే ప్రయత్నం చేస్తామని అన్నాడు. అయితే ఆన్ స్క్రీన్ రొమాన్స్ అంటే తనకు అస్సలు నచ్చదని, కానీ ఇప్పుడు దర్శకులకి చెప్పేంత స్థాయిలో తాను లేను కాబట్టి వారు చెప్పినట్లు చేస్తున్నానని చెప్పాడు. నేను, రష్మి ఒకరిని ఒకరం పట్టుకోము, ముట్టుకోము. కేవలం కళ్ళతోనే ఎక్స్ ప్రెషన్స్ చూపించే ప్రయత్నం చేస్తాము అందుకే మా కెమిస్ట్రీ స్క్రీన్ పై బాగా పండుతుంది.అలాగే తనకి పెళ్లి అంటే ఇష్టం లేదని, పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా లేదని చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో కూడా పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదని చెప్పాడు. దీనిని బట్టి తమ మధ్య ఎలాంటి బంధం లేదని, అందరూ ఊహించే విధంగా జరగదని సుధీర్ క్లారిటీ ఇచ్చాడు.