ఈ మధ్యకాలంలో పీరియాడిక్ జోనర్ కథలకి హీరోలు పెద్దపీట వేస్తున్నారు. దానికి కారణం అలాంటి కథలకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతూ ఉండటమే. రెగ్యులర్ కంటెంట్ కంటే పీరియాడిక్ టచ్ తో వస్తున్న కంటెంట్ చాలా పవర్ ఫుల్ గా జనాల్లోకి వెళ్తుంది. అందుకే దర్శకులు గతంలో జరిగిన కొన్ని సంఘటనలని స్పూర్తిగా తీసుకొని లేదంటే వారి జీవితంలో చూసిన వ్యక్తులని స్పృశిస్తూ కథలని సిద్ధం చేస్తున్నారు. ఆ కథలాని ఎమోషనల్ ఎలిమెంట్స్ తో తెరపై ఆవిష్కరించి హిట్స్ కొడుతున్నారు. రంగస్థలం, పుష్ప, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ సినిమాలు ఇలాంటి పీరియాడిక్ జోనర్ కథలకి ప్రాణం పోస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు యంగ్ హీరోలు కూడా అదే జోనర్ లో కథలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో యంగ్ హీరో సుదీర్ బాబు ఇప్పుడు కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సెహరి సినిమాతో తెరంగేట్రం చేసిన దర్శకుడు జ్ఞానశేఖర్ తో సుదీర్ బాబు సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని కాన్సెప్ట్ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చేసారు. ఈ పోస్టర్ లో ఒక ఇన్లాండ్ లెటర్, పక్కనే పెట్, నోట్, టెలిఫోన్ ఉన్నాయి.
ఇక ఈ నెల 31 న మాస్ సంభవం అని రాసి ఉంది. దీనిని బట్టి ఆ రోజు టైటిల్ తో పాటు సుధీర్ బాబు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. కుప్పం నేపధ్యంలో 1989 బ్యాక్ డ్రాప్ లో నడిచే కథగా ఈ మూవీ ఉండబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం సుధీర్ బాబు హంట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ గా ఉండబోతుంది. ప్రస్తుతం ఈ టైటిల్ పై వివాదం నడుస్తుంది.