సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోగా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సుదీర్ బాబు సొంతం చేసుకున్నాడు. ఓ వైపు కమర్షియల్ జోనర్ లో సినిమాలు చేస్తూనే మరో వైపు కంటెంట్ బేస్ కథలకి కూడా ప్రాధాన్యత ఇస్తూ తన కెరియర్ ని బిల్డ్ చేసుకునే పనిలో ఉన్నాడు. తాజాగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం మాయా మశ్చీంద్ర అనే సినిమా చేస్తున్నాడు. డిఫరెంట్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే తాజాగా జ్ఞాన శేఖర్ దర్శకత్వంలో సుదీర్ బాబు తన నెక్స్ట్ సినిమా ఉండబోతుంది అనే ప్రకటించాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఉండబోతుందని కూడా క్లారిటీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో సుదీర్ బాబు కుమారస్వామి ఆయుధాన్ని చేతిలో పట్టుకొని పరుగు పెడుతున్నట్లు ఉంది. హరోంహర అనే టైటిల్ ని సినిమాకి పెట్టాడు. దీనిని బట్టి ఈ సినిమా ఆద్యాత్మిక టచ్ తో తెరకెక్కబోయే థ్రిల్లర్ మూవీ అని అర్ధమవుతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్ లో సక్సెస్ అవుతున్న చాలా సినిమా కథలలో దైవం అనేది ప్రధానంగా కనిపిస్తుంది. హిందూ దేవతలని సెంటర్ పాయింట్ గా పెట్టుకొని కథలని చెబుతూ హిట్స్ కొడుతున్నారు.
ఇండియన్ వైడ్ గా ప్రేక్షకులు కూడా ఇలాంటి పాయింట్ ఉన్న కథలకి పట్టం కడుతున్నారు. కార్తికేయ 2, కాంతారా సినిమాలు తక్కువ బడ్జెట్ తో వచ్చిన పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెస్ కావడానికి కారణం ఆద్యాత్మిక అంశాన్ని టచ్ చేయడమే అనే మాట అందరూ చెబుతున్నారు. ఆ పాయింట్ అందరికి భాగా కనెక్ట్ కావడంతో సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చిందనే విశ్లేషకుల మాట. ఈ నేపధ్యంలో సుదీర్ బాబు కూడా అలాంటి అంశాన్ని నమ్ముకొని తన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని సెట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. మరి ఈ జోనర్ సుదీర్ బాబుకి ఎ రేంజ్ సక్సెస్ ఇస్తుంది అనేది చూడాలి.