సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మహేష్ బాబు తర్వాత ఆ స్థాయిలో ప్రస్తుతం గుర్తింపు తెచ్చుకున్న నటుడు అంటే సుధీర్ బాబు అని చెప్పాలి. మహేష్ బాబుకి భావ అయిన సుధీర్ బాబు అదే ఇమేజ్ ని హీరోగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. అయితే కెరియర్ లో సక్సెస్ రేట్ సుధీర్ బాబుకి చాలా తక్కువగా ఉంది. భలే మంచి రోజు, నన్ను దోచుకుందువటే సినిమాలతో సోలోగా సక్సెస్ సాధించాడు. సమ్మోహనం సినిమా కూడా హిట్ టాక్ ఇచ్చింది. మిగిలిన సినిమాలు అన్ని కూడా ఏవరేజ్, ఫ్లాప్ టాక్ వచ్చినవే కావడం గమనార్హం.
అయితే కమర్షియల్ హీరోగా తనని తాను ఎలివేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేసిన సినిమాలు అన్ని సుధీర్ బాబుకి చేదు ఫలితాన్నే ఇచ్చాయి. రీసెంట్ గా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాతో మరో ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ సారి కంప్లీట్ యాక్షన్ కథాంశంతో సరికొత్తగా హంట్ అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించడానికి సుధీర్ బాబు రెడీ అయ్యాడు. ఈ సినిమాకి సంబందించిన పోస్టర్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఇందులో శ్రీకాంత్ ఓ కీలక పాత్రలో నటిస్తూ ఉండగా, తమిళ్ హీరో భరత్ విలన్ గా కనిపించబోతున్నాడు.
వారిద్దరి మధ్య యాక్షన్ ఘట్టాలు పవర్ ఫుల్ గా ఉంటాయనే మాట వినిపిస్తుంది. ఇక ఈ సినిమా టీజర్ ని సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నాడు. ఈ సినిమాతో ఎలా అయిన సూపర్ హిట్ కొట్టి యాక్షన్ హీరోగా తనని తనకు ఎలివేట్ చేసుకోవాలని సుధీర్ బాబు అనుకుంటున్నాడు. ఇప్పటి వరకు అతనికి వచ్చిన మూడు హిట్స్ కూడా క్లాస్ మూవీలుగా ,మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ ని మెప్పించినవే కావడంతో మాస్ ఆడియన్స్ కి చేరువ కావడానికి హంట్ సినిమాతో రాబోతున్నాడు. మరి ఈ సినిమా అతనికి ఏ స్థాయిలో సక్సెస్ ఇస్తుందనేది చూడాలి.