సుడిగాలి సుధీర్ హీరోగా సాఫ్ట్ వేర్ సుధీర్, గాలోడు అనే రెండు సినిమాలని తెరకెక్కించిన దర్శకుడు రాజశేఖర్. గాలోడు సినిమాతో కమర్షియల్ గా సక్సెస్ ని కూడా ఈ దర్శకుడు అందుకున్నాడు. ఈ మూవీకి థియేటర్స్ లో పాజిటివ్ టాక్ వస్తుంది. ఈ దర్శకుడు తన నెక్స్ట్ సినిమాలని కూడా సుధీర్ తోనే చేస్తానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. గాలోడు సినిమాకి సుధీర్ ఇమేజ్ కూడా కలిసొచ్చిందని చెప్పుకొచ్చాడు. సుడిగాలి సుదీర్ కి బుల్లితెరపై ఫుల్ డిమాండ్ ఉంది. ప్రస్తుతం వరుసగా యాంకర్ గా షోలు చేస్తూ దూసుకుపోతున్నాడు. మరో వైపు హీరోగా వెండితెర మీద తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. గాలోడు సినిమా సక్సెస్ తో సుదీర్ కి హీరోగా కొంత వరకు డిమాండ్ పెరిగిందని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో హీరోగా ఏ స్థాయిలో నిలబడతాడో తెలియదు కాని ప్రస్తుతానికి మాత్రం చేతిలో రెండు సినిమాల వరకు రెడీగా ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు గాలోడు సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన రాజశేఖర్ మళ్ళీ సుదీర్ తో ఒక సినిమాకి రంగం సిద్ధం చేస్తున్నాడు. ఈ సారి సుదీర్, రష్మి గౌతమ్ జోడీగా గజ్జల గుర్రం టైటిల్ తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఆన్ స్క్రీన్ పై బెస్ట్ పెయిర్ గా వారిద్దరికి మంచి ఇమేజ్ ఉంది. ఈ నేపధ్యంలో చాలా కాలంగా రష్మి, సుదీర్ వెండితెరపై కనిపిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలాగే వారిద్దరి కలయిక ఇప్పటికే జరగాల్సి ఉన్నా కూడా రష్మి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో గాలోడు సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ని మిస్ చేసుకుంది.
అయితే ఈ సారి మాత్రం రష్మి, సుదీర్ తో కలిసి సినిమా చేయడం పక్కా అని దర్శకుడు రాజశేఖర్ అంటున్నారు. గజ్జలగుర్రం కథ రెడీగా ఉన్నా కూడా బౌండ్ స్క్రిప్ట్ లా లేదని తెలిపాడు. త్వరలో ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. ఫుల్ స్క్రిప్ట్ రెడీ అవ్వగానే సుదీర్, రష్మి కాంబోలో మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తానని దర్శకుడు చెప్పుకొచ్చాడు. మరి ఈ గజ్జల గుర్రం ఎప్పుడు తెరపైకి వెళ్తుంది, ఎప్పుడు ప్రేక్షకుల ముందుకి వస్తుందనేది తెలియాల్సి ఉంది.