Bigg boss 6 : ‘బిగ్ బాస్’ సీజన్ 6 ఆదివారం హోస్ట్ నాగార్జున నాటు నాటు సాంగ్‌కు స్టెప్పులు ఇరగదీశారు. ఈ సాంగ్‌తోనే ఆయన ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత సండే ఫన్‌డేలో భాగంగా కొన్ని గేమ్స్ ఆడించారు. ఇక ఆరో వారం సుదీప ఎలిమినేట్ అయ్యింది. నిజానికి సుదీప నామినేషన్స్‌లోకి వచ్చినప్పటి నుంచే ఆమే ఎలిమినేట్ అవుతుందన్న ప్రచారం నడిచింది. సుదీప ఎలిమినేట్ అవడానికి మెయిన్ కారణమే ఒక రకంగా రేవంత్. అతనేం చేయలేదు కానీ ఆమే గ్రిడ్జ్ పెంచుకుని చివరకు ఎలిమినేట్ అయిపోయింది.
రేవంత్‌పై పర్సనల్‌గా గ్రిడ్జ్ పెంచుకున్న సుదీప.. అతనిని ఎలా పడగొట్టాలి? అతడిని ఎలా కెప్టెన్ కాకుండా చూడాలి అన్న విషయాలపైనే తన దృష్టంతా పెట్టింది కానీ తన ఆటపై మాత్రం అసలు ఫోకస్ పెట్టిందే లేదు. ఆమె భర్త కాల్ చేసినప్పుడు కూడా పర్సనల్ గ్రిడ్జ్ పెట్టుకోవద్దని.. అప్పటిది అప్పుడు మర్చిపోవాలని సూచించినా మైండ్‌కి ఎక్కితేనే కదా. తీరా చూస్తే ఎలిమినేట్ అయి కూర్చొంది. పోనీ ఎలిమినేట్ అయిన తర్వాతైన బుద్దిగా అందరితో మాట్లాడినట్టే రేవంత్ తోనూ మాట్లాడిందా అంటే అదీ లేదు. అక్కడి నుంచి కూడా చురకలేసే కార్యక్రమం చేపట్టింది.
ఈ క్రమంలో మిరపకాయకి షార్ప్ టంగ్ అని రాసుంటే దాన్ని రేవంత్‌కు ఇచ్చింది సుదీప. హౌస్‌లో సుదీప ఎక్కువ శాతం కిచెన్‌లోనే గడిపింది. ఒకానొక సమయంలో రేవంత్‌కు సుదీపకు గొడవ జరిగితే ఆ సమయంలో అతను తాను కెప్టెన్ అయితే అందరినీ మార్చి పారదొబ్బుతా అన్నాడు. అది మనసులో పెట్టుకుని ‘‘మార్చిపడదొబ్బుతా అన్నావుగా కిచెన్ టీమ్.. పాపం నీకు ఆ చాన్స్ రాలేదు’’ అంటూ నవ్వుతూనే రేవంత్‌కు చురకలంటించింది. తాను ఎలిమినేట్ అయినందుకు బాధ లేదు. కానీ రేవంత్‌కు ఆ ఛాన్స్ రాలేదని సంబరపడుతోంది. ఇందుకు కాదు.. సుదీప ఎలిమినేట్ అయ్యింది.