Sudeep : కన్నడ హీరో దర్శన్‌పై జరిగిన దాడికి సంబంధించి కన్నడ ఇండస్ట్రీలోని స్టార్స్ స్పందిస్తున్నారు. తోటి కళాకారుడిపై జరిగిన దాడిని ఖండిస్తున్నారు. తాజాగా దర్శన్ నటించిన సినిమా క్రాంతి ప్రమోషన్స్ లో భాగంగా ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్నారు దర్శన్. ఈ ఈవెంట్‌కు దర్శన్ తో పాటు తోటి కళాకారులు హాజరయ్యారు. అయితే ప్రమోషనల్ ఈవెంట్ కొనసాగుతున్న సమయంలో నటుడు పునీత్, దర్శన ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి తాను కాలికి వేసుకున్న చెప్పును విసిరాడు. అది హీరో భుజానికి తగలడంతో ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దర్శన్ పై దాడి వీడియో కూడా నెట్టింట్లో సెన్సేషన్‌ను క్రియేట్ చేస్తోంది.

గతంలో దర్శన్ మహిళలపైన అనుచిన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు చాలానే వచ్చాయి. అదృష్టత దేవత తలుపు దడితే వెంటనే ఆమె దుస్తుతలు విప్పి ఇంట్లో కూర్చోబెట్టాలని లేదంటే ఆమె మరోచోటకి వెళ్లిపోతుందని దర్శన చేసిన వ్యఖ్యలపై మహిళలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ కాంట్రవర్సీ కామెంట్స్ నేపథ్యంలోనే దర్శన్ పై దాడి జరిగిందని కొంత మంది స్టార్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సంఘటనకు సంబంధించి కన్నడ ప్రముఖులు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.

కన్నడ స్టార్ హీరో సుదీప్ దర్శన్ పై జరిగిన దాడిని ఖండించారు. కన్నడీయులు వ్యవహరించేది ఇలాగేనా అని సోషల్ మీడియా ద్వారా స్పందించారు. దర్శన్‌పై జరిగిన దాడి తనను తీవ్రంగా కలచివేసిందని సుదీప్ పేర్కొన్నారు. పునీత్ ఉంటూ దీనిని సపోర్ట్ చేసేవారా అని ప్రశ‌్నించారు. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుందని ఆయన తెలిపారు. ఇదే ప్రమోషనల్ ఈవెంట్‌లో వేరే నటులు,నటీమనులు ఉన్నారని ఈ ఘటనతో అందరిని అవమానించారని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో స్టార్స్ ఫ్యాన్స్ మధ్య వార్ కామనే అని కానీ మరీ ముఖ్యంగా దర్శన్, పునీత్ ఫ్యాన్స్ మధ్య ప్రశాంత వాతావరణం లేదని దానికి అంగీకరీస్తానని అలాగని ఇలాంటి చర్యలకు పాల్పడటం సమంజసం కాదని అన్నారు. ఏదీ, ఎవ్వరూ ఎప్పుడూ శాశ్వతం కాదని, అందరిని ప్రేమిద్దామని తెలిపారు. తన మాటల్లో ఏమైనా తప్పుంటే క్షమించాలని అభిమానులను కోరారు.