ఢిల్లీలో వాయి కాలుష్యం ప్రమాదక ఘంటికలను మోగిస్తున్న అటు కేంద్ర ప్రభుత్వం,ఇటు రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహిస్తున్నాయి.హర్యానా,పంజాబ్ రాష్ట్రాలలో రైతులు పంట చేతికొచ్చక అక్కడున్న మిగిలిన చెత్తను తగలబెడుతారు ఇది ఢిల్లీ లోని వాయి కాలుష్యానికి ముఖ్య కారణంగా నిలుస్తుంది.ఈ అంశంపై ఆ రాష్ట్రాలలో ఓట్లు పోతాయనే భయంతో బిజేపి,ఆమ్ ఆద్మీ పార్టీ నోరు మెదపడం లేదు ఇక ప్రతిపక్షమైతే మాకేం సంబంధం లేదు అంటూ చేతులు దులిపేసుకుంటుంది.
ఈ విషయాలపై కనీసం మీడియా కూడా ఎలాంటి కథనాలు ప్రసారం చేయకపోవడం చాలా విడ్డూరంగా ఉంది.ఢిల్లీ,ముంబై వంటి మహా నగరాలను కాపాడుకోవడానికి ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాల వైపు నడిపేందుకు ముందుగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు
కార్బన్ ను ఏమిటి చేసే వాహనాలను పూర్తిగా ఆపేయాలి అప్పుడే ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్ళడానికి ఆసక్తి చూపుతారు.