బిగ్ బాస్ సీజన్ 6 ప్రస్తుతం నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. హౌస్ లో ప్రస్తుతం 18 కంటిస్టెంట్ లు ఉన్నారు. రసవత్తరంగా ఎపిసోడ్స్ సాగుతున్నాయి. అయితే హౌస్ లో గేమ్ ఆడవారి కంటే ఆడనివారే ఎక్కువగా ఉన్నారనే విమర్శలు నెటిజన్స్ నుంచి వినిపిస్తున్నాయి. నామినేషన్ ఓటింగ్ ప్రక్రియలో కూడా పెద్దగా ఎవరూ పార్టిసిపేట్ చేయడం లేదనే మాట వినిపిస్తుంది. హౌస్ లో తక్కువగా కనిపించేవారు, అలాగే గేమ్ ఆడనివారికి ఓటింగ్ తక్కువగా వస్తుంది. అలాంటి వారందరూ ఎలిమినేట్ అయిపోతున్నారు. షాని సోలొమన్, అభినయశ్రీ, నేహా చౌదరి అలాగే ఎలిమినేట్ అయిపోయారు. ఇక ఈ వీక్ డేంజర్ జోన్ లో ఇనాయ సుల్తానా, వాసంతి, ఆరోహి ఉన్నారు. వీరి ముగ్గురులో ఒకరు ఎలిమినేట్ అవ్వడం పక్కా అనే మాట వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ షోపై సోషల్ మీడియాలో హాట్ న్యూస్ వినిపిస్తుంది. స్టార్ మా యాజమాన్యం బిగ్ బాస్ టెలివిజన్ ప్రసారంకి ముగింపు పలకడానికి రెడీ అవుతుందని టాక్. దీనికి కారణం గత ఐదు సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సారి స్టార్ మాకి బిగ్ బాస్ 6 ద్వారా అతి తక్కువ రేటింగ్స్ వస్తున్నాయి. సీజన్ 6 ఆరంభ ఎపిసోడ్ కూడా బిగ్ బాస్ హిస్టరీలోనే అతి తక్కువగా 9 రేటింగ్ వచ్చింది. అయితే ప్రతి రోజు ప్రసారం అవుతున్న ఎపిసోడ్స్ కి అయితే మరీ దారుణమైన రేటింగ్ వస్తుందని తెలుస్తుంది. అత్యల్పంగా 2 నుంచి 3 మధ్యలో బిగ్ బాస్ డైలీ ఎపిసోడ్ రేటింగ్స్ ఉన్నాయని టాక్.
ప్రైమ్ టైంలో టెలికాస్ట్ అయ్యే సీరియల్స్ అన్నింటికీ స్టార్ మాలో 10కి పైగా రేటింగ్ వస్తుంది. అయితే బిగ్ బాస్ కి మాత్రం టెలివిజన్ లో ప్రేక్షకాదరణ పెద్దగా లేదు. ఓటీటీలో బిగ్ బాస్ ని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో స్టార్ మా బిగ్ బాస్ సీజన్ 6 టెలివిజన్ ప్రసారాన్ని పూర్తిగా ఆపేయాలని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ సీజన్ వరకు హాట్ స్టార్ ఓటీటీలో ఎపిసోడ్స్ ప్రసారం చేసి నెక్స్ట్ కంప్లీట్ గా బిగ్ బాస్ తో బంధం తెంచుకోవాలని భావిస్తున్నట్లు బోగట్టా. చాలా మంది ఇప్పుడు ఓటీటీకి సినిమాలు, సీరియల్స్ కోసం పరిమితం అయిపోయారు. ఈ నేపధ్యంలో బిగ్ బాస్ సీజన్ 6 ఎపిసోడ్స్ కూడా హాట్ స్టార్ లోనే చూస్తున్నారు. దీంతో టెలివిజన్ లో ఈ షో రేటింగ్స్ గణనీయంగా పడిపోయినట్లు సమాచారం.