Star Heroins : ఇటీవలి కాలంలో మనం తీసుకుంటున్న ఆహారం నుంచి పీల్చే గాలి వరకూ అన్నీ కలుషితమై పోతున్నాయి. సెలబ్రిటీలంటే మంచి ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటారు కాబట్టి వారికేం ప్రాబ్లమ్ ఉండదు మనలాంటి సామాన్య జనానికే సమస్యలన్నీ అనుకుంటున్నారా? అదేం లేదు. ప్రతి ఒక్కరం కూడా వయసుతో సంబంధం లేకుండా ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉన్నాం.అయితే మందులతో జబ్బు నయమైతే ఇదొక పెద్ద విషయమేమీ కాదు.కానీ కొన్ని వ్యాధులు మెడిసిన్‌కు లొంగవు.
మరికొన్ని వ్యాధులకు జీవితాంతం మెడిసిన్ వాడుతూనే ఉండాలి. ఇక విషయానికి వస్తే ఇటీవల సమంత తాను మయోసైటిస్ అనే ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో బాధపడుతున్నానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది.ఆ సమస్యతో చర్చ బీభత్సంగానే జరిగింది. అయితే మరి ఇండస్ట్రీలో ఇలా ఏవో ఒక సమస్యలతో బాధపడే హీరోయిన్స్ లేరా? అంటే చాలా మందే ఉన్నారు. ఇండస్ట్రీలోని వారికి ఎక్కువగా వారి మేకప్ కారణంగా క్యాన్సర్ సోకుతూ ఉంటుంది. అలా కాకుండా సమంతలా చర్మ సమస్యలతో కానీ లేదా ఇతర సమస్యలు ఏవైనా వాటితో జబ్బులతో ఇబ్బంది పడుతున్నారా? అంటే అవుననే సమాధానమే వినవస్తోంది.
స్టార్ హీరోయిన్ ఇక సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార స్కిన్ అలర్జీ సమస్యను ఎదుర్కొంటోంది.ఇక గోవా బ్యూటీ ఇలియానా డిమ్ మార్ఫిక్ బాడీ డిజార్డర్‌తో బాధ పడుతోంది. బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా డిప్రెషన్‌తో బాధ పడుతోంది.నిజానికి బాలీవుడ్‌లో డిప్రెషన్‌తో బాధపడే స్టార్ హీరోయిన్‌ల సంఖ్య కాసింత ఎక్కువే అని చెప్పాలి. మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణె అలాగే అనుష్క శర్మ ఈ డిప్రెషన్‌తో ఇబ్బంది పడుతున్నారు. మరో హీరోయిన్ సోనమ్ కపూర్ షుగర్ వ్యాధితో బాధపడుతోంది. ఇక నటి స్నేహ ఉల్లాల్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో బాధపడుతోంది.