Star Heroine: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తర్వాత వారి లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోతుంది.ఈ క్రమంలోనే ఆ సెలబ్రిటీలు ఉపయోగించే ప్రతి చిన్న వస్తువు కూడా ఎంతో ఖరీదైనది మంచి బ్రాండ్లకు సంబంధించిన వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ విధంగా సెలబ్రిటీలు కొనుగోలు చేసే వస్తువులు ఖరీదు తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతూ ఉంటారు.
అయితే ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగి కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎన్నో అవకాశాలను అందుకొని భారీగా ఆస్తులు కూడా పెట్టుకున్నటువంటి రకుల్ ప్రీత్ సింగ్ ఈ విషయంలో మాత్రం కాస్త భిన్నంగా ఉంటారని చెప్పాలి.
ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమాలలో నటించి అగ్రతారగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఉండి భారీగా ఆస్తులు సంపాదించి ప్రస్తుతం ఆ డబ్బును వ్యాపారాలలో పెట్టుబడిగా పెట్టింది.
ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి నిర్మాత జాకీభగ్నానితో ప్రేమలో ఉన్నటువంటి ఈ ముద్దుగుమ్మ అగ్రతారగా కొనసాగినప్పటికీ తాను మాత్రం కాస్ట్లీ వస్తువులను ఉపయోగించని తెలిపారు. కెరియర్ ప్రారంభంలో తాను అనుభవించిన కష్టాలను ఎప్పటికీ మర్చిపోనని నా జీవితంలో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదోనని ఈమె కెరియర్ మొదట్లో తాను ఎదుర్కొన్న అనుభవాల గురించి బయట పెట్టారు.
Star Heroine: మధ్యతరగతి కుటుంబంలో పెరగడంతో డబ్బు విలువ తెలుసు…
ఇప్పుడు అదృష్టం కలిసి వచ్చి తాను స్టార్ హీరోయిన్ అయినప్పటికీ మనం ఎదుర్కొన్న కష్టాలను ఎప్పుడు మరిచిపోకూడదని అందుకే తాను డబ్బుని ఎంతో పొదుపుగా ఉపయోగిస్తానని ఈమె తెలిపారు.అందరిలా తాను ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయనని తక్కువ ధరలోనే తనకి నచ్చినవి కొనుగోలు చేస్తానంటూ ఈమె వెల్లడించారు. చిన్నప్పటినుంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో పెరగటం వల్ల డబ్బు విలువ తెలుసని, ఈ సందర్భంగా రకుల్ ప్రీతిసింగ్ తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.