Ayshman Khurana : ప్రముఖ నటీనటులంతా ఈ మధ్య ఏదో ఒక సమస్య బారిన పడుతున్నారు. గతంలో ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాను మయోసైటిస్‌తో బాధపడుతున్నట్టు వెల్లడించింది.ఇది టాలీవుడ్‌లో సంచలనం రేపింది. ఇక తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో ఒకరు కూడా తన ఆరోగ్యానికి సంబంధించిన షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. ఆయన మరెవరో కాదు.. బాలీవుడ్ స్టార్ ఆయుష్మాన్ ఖురానా. గత ఆరేళ్లుగా తాను వెర్టిగో అనే సమస్యతో బాధపడుతున్నట్టు వెల్లడించాడు.
షూటింగ్ సమయంలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో తనకు ఉన్న సమస్యతో తాను చాలా ఇబ్బంది పడ్డానని ఆయుష్మాన్ ఖురానా వెల్లడించాడు.తాను ఈ సమస్యను ఆరేళ్లుగా అనుభవిస్తున్నానని తెలిపాడు.ప్రస్తుతం ఆయుష్మాన్.. ఆన్ యాక్షన్ హీరో అనే కొత్త మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎత్తైన భవనం పైనుంచి దూకే ఒక సీన్ ఉంటుంది. ఈ సమయంలోనే తాను చాలా భయపడిపోయానని.. రక్షణ కోసం హార్నెస్ కేబుల్స్ ఉన్నా కూడా తనొక భ్రమకు గురయ్యానని చెప్పుకొచ్చాడు.ఆ సమయంలో తనకు నరాలు తెగిపోతాయోమో అనిపించిందని ఆయుష్మాన్ వెల్లడించాడు.
‘వెర్టిగో’ లక్షణాలు
సాధారణంగా 20 నుంచి 80 ఏళ్ల లోపు వారు ఈ సమస్యకు గురవుతుంటారు.వెర్టిగో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి కళ్లు తిరుగుతాయి. ఎక్కడి నుంచో గిరాగిరా తిరిగి పడుతున్నట్టు అనిపిస్తుంది. కచ్చితంగా చెప్పాలంటే.. రంగులరాట్నం మీద తిప్పి అక్కడి నుంచి విసిరేసినట్లుగా ఉంటుంది. నడుస్తున్నప్పుడు తూలి పడిపోవడం జరుగుతుంటుంది. తల తిరుగుతుంది. తద్వారా పరిసరాలన్నీ తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. సరిగా నిలబడలేరు. దీంతో బ్యాలెన్సన్ కోల్పోతుంటారు. వికారంగా అనిపించడం.. వాంతులు కావడం.. చెమటలు ఎక్కువ పట్టడం జరుగుతూ ఉంటుంది. అసలు ఈ సమస్యకి ఎక్కువగా చెవి ఇన్ఫెక్షన్, మెదడు, గుండె సంబంధిత సమస్యలు కారణమవుతూ ఉంటాయి.