Bigboss 6 : అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ అన్ని భాషల్లోనూ సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. తెలుగులో ఐదు సీజన్లు పూర్తి చేసుకుని.. ఆరో సీజన్‌లోకి అడుగు పెట్టబోతోంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక సైతం పూర్తై అందరినీ క్వారంటైన్‌కు పంపించినట్టు టాక్ నడుస్తోంది. ఒక స్టార్ హోటల్‌లో కంటెస్టంట్లు అందరినీ క్వారంటైన్‌లో పెట్టినట్టు సమాచారం. ఈ షో సెప్టెంబర్ 4న సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం కానుంది.గత మూడు సీజన్లుగా ఆకట్టుకుంటున్న కింగ్ నాగార్జునే ఈ సీజన్‌కు సైతం హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.
ఇదిలా ఉండగా ఒక ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గతంలో ఒక సీజన్‌లో హీరో వరుణ్ సందేశ్, ఆయన భార్య వితికా అలరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీజన్ 6లో కూడా ఒక స్టార్ కపుల్ అలరించబోతున్నారని టాక్. వారెవరో కాదు.. సింగర్ హేమంత్, శ్రావణ భార్గవి. ఇటీవలి కాలంలో ఈ స్టార్ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ టాక్ నడిచిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఈ మధ్య కాలంలో ఆ వార్తలకు కాస్త బ్రేక్ పడింది. తాజాగా వీరిద్దరూ బిగ్‌బాస్‌లో అలరించబోతున్నారంటూ టాక్.
Bigboss 6 : సీజన్ 2 నుంచి ఆ రివాజు ప్రారంభమైంది..
రెండవ సీజన్ నుంచి ప్రతి ఏడాది న్యూస్ ఛానల్ నుంచి యాంకర్స్‌ను తప్పనిసరిగా బిగ్‌బాస్ నిర్వాహకులు తీసుకుంటారన్న విషయం తెలిసిందే.
ముఖ్యంగా సీజన్ 2 నుంచి ఈ రివాజు ప్రారంభమైంది. బిగ్‌బాస్ 2లో దీప్తి నల్లమోతు.. ఆ తరువాతి సీజన్‌లలో జాఫర్, దేవి నాగవల్లి, శివజ్యోతి, శివ ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్‌లో ఇద్దరు యాంకర్స్ ఉండబోతున్నారంటూ టాక్ నడుస్తోంది. ఈ ఇద్దరూ కూడా ఒకే న్యూస్ ఛానల్‌కు చెందిన వారని సమాచారం. ఇక బిగ్‌బాస్‌లో నడుస్తున్న మరో సంప్రదాయం సింగర్స్.. ప్రతి సీజన్‌లో దాదాపుగా ఒక సింగర్ కామన్‌గా ఉంటూ వస్తున్నారు. ఈ సారి బిగ్‌బాస్ నిర్వహకులు సింగర్ రేవంత్‌ను పిక్ చేసుకున్నట్టు సమాచారం.