ప్రస్తుతం దేశంలోని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం తమపై పెత్తనం చేస్తుందనే కారణాన్ని చూపి కేంద్ర ప్రభుత్వంతో లడాయికి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తెలంగాణ, ఏపీ, కేరళ, ఢిల్లీ, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, గోవా వంటి 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒక లేఖ రాశారు.
ఈ లేఖలో విద్యారంగంపై రాష్ట్రాలకు ఉండాల్సిన హక్కులపై,నీట్ విద్యార్థులపై చూపే ప్రభావం వంటి అంశాల గురించి ప్రస్తావించారు. తనతో కలిసి కేంద్రంపై పోరాడి విద్యారంగంలో మార్పు తెచ్చేందుకు సహకరించాలని ఆయన 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు.మరి ఈ అంశంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సివుంది.