సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి నెక్స్ట్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కె.ఎల్.నారాయణ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఇక దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్నాయి. విజయేంద్రప్రసాద్ స్టోరీని సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించి రాజమౌళి ఇప్పటికే అప్డేట్ ఇచ్చారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకి సంబంధించి జపాన్ ప్రమోషన్ లో రాజమౌళి పాల్గొన్నారు. అక్కడ చాలా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఇక లాస్ ఏంజిల్స్ లో కూడా ఈ మూవీని స్క్రీనింగ్ చేస్తున్నారు. అక్కడి ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ నేపధ్యంలోనే అక్కడి ఆడియన్స్ తో రాజమౌళి ముచ్చటించారు.
ఇందులో భాగంగా తాను తీయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మరోసారి ఆసక్తికర విషయాలని చెప్పారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోయే తన నెక్స్ట్ మూవీ గ్లోబల్ లెవల్ లో యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుందని తెలిపారు. గ్లోబల్ ట్రెండింగ్ గా ఆ సినిమాని గ్రాండియర్ గా ఆవిష్కరించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా హాలీవుడ్ క్యాస్టింగ్ ని మహేష్ బాబు సినిమా కోసంతీసుకోవడానికి రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.
ముఖ్యంగా థోర్ సినిమాలో చేసిన హీరోని మహేష్ సినిమాలో క్యామియో రోల్ కోసం దించుతున్నారని టాక్, అలాగే మర్వెల్ సిరీస్ నటుడుని కూడా సూపర్ స్టార్ మూవీలో కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్లు వినిపిస్తుంది. వీటిని నిజం చేస్తూ రాజమౌళి అంతర్జాతీయ వేదికపై సూపర్ స్టార్ మహేష్ మూవీని గ్లోబల్ లెవల్ లో పాన్ వరల్డ్ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మూవీ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ నవంబర్, డిసెంబర్ లో ఉంటుందని, జనవరి నుంచి ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ కంప్లీట్ చేసే పనిలో రైటింగ్ టీమ్ పని చేస్తుందని తెలుస్తుంది.