సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే అనే విషయాన్ని స్పష్టం చేసేశారు. ఇక ఈ మూవీని పాన్ వరల్డ్ చిత్రంగా మలిచేందుకు రాజమౌళి సిద్ధం అవుతున్నారు. దానికోసం హాలీవుడ్ క్యాస్టింగ్ ఏజెన్సీ సీఏఏతో ఒప్పందం చేసుకున్నారు. కొంత మంది హాలీవుడ్ నటుల్ని ఈ మూవీ కోసం ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ముఖ్యంగా మర్వెల్ సిరీస్ లో నటించిన యాక్టర్స్ ని సూపర్ స్టార్ మూవీ కోసం రంగంలోకి దించుతున్నారని టాక్ నడుస్తుంది.
ఇక నిర్మాత కె.ఎల్.నారాయణ ఈ మూవీ కోసం ఎంత పెద్ద బడ్జెట్ అయినా పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఈ నేపధ్యంలోనే హాలీవుడ్ నటులని సినిమా కోసం ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుతం జక్కన్న ఇదే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ జనవరిలో స్టార్ట్ చేయాలని భావించారు. అయితే ఆ టైంకి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉండవనే మాట వినిపిస్తుంది. పాన్ వరల్డ్ చిత్రంగా మార్చడంతో మరల స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ నేపధ్యంలో నవంబర్ లేదా డిసెంబర్ లో సినిమాని అఫీషియల్ గా ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది.
ఇక ఆ తర్వాత ప్రీప్రొడక్షన్ వర్క్ కోసం ఆరు నెలల సమయం తీసుకోబోతున్నారని తెలుస్తుంది. ఈ నేపధ్యంలో సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నారనే మాట ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథ ఉండబోతుందని, అలాగే వరల్డ్ అడ్వాంచర్ ట్రావెలర్ గా మహేష్ బాబు ఈ మూవీలో కనిపిస్తాడని ఇప్పటికే రాజమౌళి చెప్పారు. ఈ నేపధ్యంలో సినిమా ఆలస్యం అయినా పాన్ వరల్డ్ రేంజ్ లో కాబట్టి కచ్చితంగా వెయిట్ చేయొచ్చు అనే మాట సూపర్ స్టార్ ఫ్యాన్స్ నుంచి వినిపిస్తుంది.